ఎన్టీఆర్ సెట్స్ పై అది జరగలేదు

By Staff

Nayantara
"అవన్నీ ఆధారం లేని ఆరోపణలు..ఎవరు ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావటం లేదు...నేను హైదరాబాద్..శనివారం సాయింత్రం వచ్చాను..యూనిట్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యాను..ఐ యామ్ ఫెరఫెక్టలీ ఫైన్"అంటూ మీడియాకి వివరించింది నయనతార.

ఎన్టీఆర్..వి.వి.వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్ లో నయనతార కళ్ళు తిరిగి పడిపోయిందనే వార్త చాలా పేపర్లలో వచ్చాయి. దానికామె ఇలా తీవ్రంగా స్పందించింది. అటువంటిదేమీ జరగలేదని, కావాలని అటువంటి రూమర్ పుట్టించారని నయనతార ఖండించింది. ఆ పేపర్లలో నయనతార..డైటింగ్ కోసం డైట్ చాలా తక్కువ పరిణామంలో తీసుకోవటంతో ఈ పరిస్ధితి తలత్తెందని వివరించింది. ఇంతకుముందు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో రజనీ..కథానాయకుడూ షూటింగ్ సమయంలో నయన కళ్ళు తిరిగిపడిపోయిందనే వార్త వచ్చింది.

అయితే అప్పుడు దానిపై కామెంట్ చేయని నయన ఇప్పుడు మీడియా వ్యక్తులపై మండిపడుతోంది. తన వెనక ఎవరో ఇటువంటి గాసిప్స్ పుట్టిస్తున్నారని సీరియస్ అవుతోంది.ఇక ప్రస్తుతం అన్నపూర్ణాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ కాంబినేషన్ పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఫస్ట్ షెడ్యూల్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని, అయితే ఇలాంటివి బయిటకు పొక్కితే..కెరీర్ కే దెబ్బ అని శ్రేయాభిలాషులు హెచ్చరించటంతో ఆమె ఇలా స్టేట్ మెంట్స్ ఇస్తోందని విశ్వసనీయ సమాచారం. అందులోనూ ఆమె ఆ మధ్య నమ్ముకున్న తమిళ పరిశ్రమలో ఆమెకు చుక్కెదురు కావటం,వరస ఫ్లాఫ్ లు ఆమెను ఇన్ సెక్యూర్ గా ఫీలయ్యేటట్లు చేస్తున్నాయని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X