షాకింగ్ భంగిమల్లో సెక్సీ శద్ధాదాస్ యోగా (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. 'సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రద్ధాదాస్ ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా అమ్మడుకు ఆశించినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. మెయిన్ హీరోయిన్‌గా దాదాపు అరడజను చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
రాను రాను హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సెకండ్ హీరోయిన్ పాత్రలకు కూడా కమిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రద్ధా దాస్‌కు. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, మరో చరిత్ర, మొగుడు లాంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'రేయ్' చిత్రంలో తప్ప ఎందులోనూ నటించడం లేదు. అయితే హిందీ, మళయాలం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
సినీ పరిశ్రమలో తన మనుగడ కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడూ సెక్సీ ఫోటో షూట్లతో కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు తన శరీరాకృతిని కాపాడుకోవడం యోగా ప్రాక్టీస్ కూడా చేస్తోంది. యోగా గురించి ఆమె మాట్లాడుతూ....మానసిక ప్రశాంతత, బాడీ ఫిట్‌నెస్ కోసం యోగా ఎంతో అవసరమని చెబుతోంది. ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించిన యోగా భంగిమలు ఆకట్టుకుంటున్నాయి.

శ్రద్ధా దాస్ యోగా భంగిమ
హీరోయిన్ శ్రద్దా దాస్ ప్రదర్శించిన యోగా భంగిమలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

యోగా వల్ల లాభాలు
యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, మానసిక ప్రశాంతతో పాటు శరీర పటుత్వం సిద్ధిస్తుందని శ్రద్ధా దాస్ చెప్పుకొచ్చారు.

శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్ గురించి పర్సనల్ విషయాల్లోకి వెళితే ఆమె మహారాష్ట్రలోని ముంబైలో సెటిలైన బెంగాళీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి బిజినెస్ మేన్.

శ్రద్ధా దాస్ నటించిన చిత్రాలు
శ్రద్ధా దాస్ ఇప్పటి వరకు సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, టార్గెట్, డైరీ, అధినేత, ఆర్య 2, మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి, మొగుడు తదితర చిత్రాల్లోనటించింది.


Click it and Unblock the Notifications











