చిరంజీవిలా మారాలనే ఆలోచన లేదు : మహేష్ బాబు

టీవీఎస్ మోటార్ బైక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న మహేష్ బాబు, ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. 100 ఏళ్ళ చరిత్ర వున్న టీవీఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం నాకు లభించిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నాను అన్నారు.
చిరంజీవి తర్వాత ఖాలీ అయిన టాలీవుడ్ నెం.1 స్థానాన్ని సొంతం చేసుకునే ఆలోచన ఉన్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ...'నేనెప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు. ప్రతీ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. నిజానికి ఈ నెంబర్ గేమ్ లను నేను నమ్మను. అందరూ బాగా చేస్తున్నారు. కథకు తగినట్లుగా ఉంది కాబట్టే '1' టైటిల్ పెట్టాం. మరే ఇతర ఉద్దేశ్యం లేదు' అన్నారు.


Click it and Unblock the Notifications











