twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్లు విప్పడం లేదా? ఈ సమాజం గురించి పట్టించుకోను: న్యూడ్ సీన్‌సై అమలా పాల్

    |

    అమలా పాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'ఆడై'. ఈ చిత్రం తెలుగులో 'ఆమె' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 19న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అమలా పాల్ పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

    ఈ సందర్భంగా ఓ యాంకర్ అమలా పాల్ నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు. కామన్ ఆడియన్స్ అంతా 'ఆమె' జూదం గురించి, స్మోకింగ్ గురించి, తాగుడు గురించి, ఎల్జీబీటీ గురించి అనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించగా.... ఇది మీరు అనుకుంటున్న విషయాల గురించో, శరీరం గురించో, సెక్స్ గురించో కాదు. అయితే అవన్నీ సినిమాలో ఒక భాగంగా ఉంటాయని అమలా పాల్ తెలిపారు.

    ఈ సినిమా ద్వారా ఒక నిజమైన కథను చెప్పబోతున్నాం

    ఈ సినిమా ద్వారా ఒక నిజమైన కథను చెప్పబోతున్నాం

    ఈ సినిమా ద్వారా ఒక నిజమైన కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రత్నకుమార్ చెప్పిన స్టోరీ విన్నపుడు ఇంగ్లిష్ సినిమాల్లో మాత్రమే చేసే ఇలాంటి కథలు మన వద్దు రావాల్సిన అవసరం ఉంది అనిపించింది. అలా అని ఇది ఇంగ్లీష్ సినిమాల రీమేక్ కాదు. రత్నకుమార్ తయారు చేసిన ఒరిజినల్ స్క్రిప్టు అని అమలా పాల్ తెలిపారు.

    ఈ సమాజం గురించి పట్టించుకోను

    ఈ సమాజం గురించి పట్టించుకోను

    మన సొసైటీలో ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు చేయడాన్ని అంగీకరిస్తారా. వారు మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారని అనుకుంటున్నారు... అనే ప్రశ్నకు అమలా పాల్ స్పందిస్తూ అవన్నీ ఆలోచిస్తే నేను యాక్టర్ అయ్యేదాన్ని కాదు. పేయింటర్స్ నగ్నంగా పెయింటింగ్స్ వేస్తారు, మనం ఆసుపత్రికి వెళితే గైనకాలజిస్ట్ ఉంటారు. వీరు చేసే పనులన్నీ భిన్నంగా ఉంటాయి. ఇలాంటి వాటికి కండీషన్లు పెడితే కుదరదు. ఈ సమాజం నన్ను జడ్జ్ చేస్తుందని ఆలోచిస్తూ కూర్చుంటే నేను నటిగా ఎంచుకున్న పాత్రకు న్యాయం చేయలేను... అన్నారు.

    ఇది ఒక అర్థవంతమైన కథ

    ఇది ఒక అర్థవంతమైన కథ

    అయితే సినిమా చూడకుండా కేవలం టీజర్ చూసి జడ్జ్ చేయడం సరికాదు. సినిమా చూసిన తర్వాత అందరూ కన్విన్స్ అవుతారు. ‘ఆమె' కథ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇది ఒక అర్థవంతమైన కథ. నగ్నంగా నటించడానికి గల కారణం ఏమిటో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అన్నారు.

    పాటల కోసం వాళ్లు విప్పడం లేదా?

    పాటల కోసం వాళ్లు విప్పడం లేదా?

    సినిమాల్లో చాలా మంది హీరోయిన్లు పాటల కోసం బట్టలు విప్పుతున్నారు. అలాంటి వాటికే వారు అలా చేస్తున్నపుడు కంటెంట్ ఉన్న సినిమాలో పాత్ర కోసం నేను ఇలా చేయడం తప్పు లేదు అనిపించింది. సినిమా పూర్తిగా చూసిన తర్వాత ఈ చిత్రంపై అందరి అభిప్రాయాలు మారుతాయని అమలా పాల్ తెలిపారు. న్యూడ్ సీన్ చేసేపుడు కేవలం ఐదుగురు మాత్రమే సెట్స్‌లో ఉన్నారని స్పష్టం చేశారు.

    English summary
    I don't care about society, Amala Paul about Aame movie. Aame is an upcoming Indian Tamil-language thriller film directed by Rathna Kumar, who earlier directed Meyaadha Maan and produced by Viji Subramaniyan under the production banner V Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X