నా రేంజ్ పెరిగిందంటున్న కలర్స్ పాప
తన రేంజ్ పెరిగింది కాబట్టే నాపై గాసిప్స్ కూడా పెరిగాయి అంటోంది కలర్స్ పాప స్వాతి. ఇటీవల తన గురించి మీడియాలో వస్తున్న పుకార్లపై స్వాతి తనదైన రీతిలో స్పందించింది. వదంతులకు భయపడనని, విమర్శలకు కూడా ఒక అర్హత(రేంజ్) ఉంటుంది. అలాంటి విమర్శలను గౌరవిస్తాను. ఇతర వదంతుల గురించి భయపడాల్సిన అవసరం లేదనేదే నా పాలసీ అంటోంది.
తనకు డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ముఖ్యం కాదంటోన్న స్వాతి...తాను నటిని అవుతానని ఊహించలేదని, అనుకోకుండా జరిగిందని, అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికే ప్రయత్నిస్తానని స్వాతి చెప్పింది. తమిళంలో సుబ్రమణిపురం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని స్వాతి తెలిపింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా నచ్చిన పాత్రలేవీ లేకపోవటంలో ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.
ఈ సంవత్సరం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని స్వాతి...తమిళంలో పోరాలి చిత్రంలో నటించింది. అల్లరి నరేష్ కూడా నటించిన ఈ సినిమా తెలుగేలో ఇటీవల 'సంఘర్షణ' పేరుతో రూపొందింది. ప్రస్తుతం స్వాతి తమిళంలో 'అమాలి తుమాలి' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం 2012లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











