నటిని రేప్ చేస్తానన్న వ్యక్తికి జాబ్ ఆఫర్: నిర్మాత నీచం, సూపర్ స్టార్ మౌనం..

By Bojja Kumar

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, నటి పార్వతి మధ్య రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదంలో తొలిసారిగా మమ్ముట్టి నోరు విప్పారు. పార్వతి కామెంట్లపై మమ్ముట్టి స్పందిస్తూ ఈ దేశంలో ఎవరికైనా తమ భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది, వివాదాల జోలికి తాను వెళ్లదలుచుకోలేదని, మనకు అర్థవంతమైన డిబేట్స్ అవసరం అని వ్యాఖ్యానించారు.

Recommended Video

యువతిపై కన్నడ నటుడి రేప్ !
అభిమానుల తీరుపై మమ్ముట్టి ఇలా

అభిమానుల తీరుపై మమ్ముట్టి ఇలా

మీ అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు, రేప్ చేస్తామంటున్నారు, యాసిడ్ దాడి చేస్తామంటున్నారు..? దీనిపై మీ స్పందన ఏమిటి అనే ప్రశ్నకు మమ్మట్టి రియాక్ట్ అవుతూ..... నా తరుపున మాట్లాడటానికి, డిఫెండ్ చేయడానికి తాను ఎవ్వరినీ నియమించలేదన్నారు.

అసలు విషయం దాటవేసే ప్రయత్నం చేసిన సూపర్ స్టార్

అసలు విషయం దాటవేసే ప్రయత్నం చేసిన సూపర్ స్టార్

మమ్ముట్టి నటించిన ‘కసాబా' సినిమాలోని డైలాగ్‌లు మహిళల్ని అవమానించేరీతిలో ఉన్నాయని పార్వతి విమర్శించిన సంగతి తెలిసిందే. పార్వతి వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. అయితే తన సినిమాలోని డైలాగుల గురించి మాట్లాడటానికి మమ్ముట్టి ఇష్టపడలేదు. దాటవేసే ప్రయత్నం చేశారు.

ఫ్యాన్స్‌కు బుద్ది చెప్పకుండా సూపర్ స్టార్ మౌనం

ఫ్యాన్స్‌కు బుద్ది చెప్పకుండా సూపర్ స్టార్ మౌనం

పార్వతి వ్యాఖ్యలపై మమ్ముట్టి అభిమానులు రెచ్చిపోయారు. మా హీరోపై కామెంట్స్ చేసిన నిన్ను రేప్ చేస్తాం, యాసిడ్ దాడి చేస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. దీనిపై పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రింటో అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ మమ్ముట్టి అభిమానులకు బుద్దిచెప్పకుండా మౌనం పాటించడం గమనార్హం.

రేప్ చేస్తానన్న వ్యక్తి జాబ్ ఆఫర్ చేసిన నిర్మాత... మరింత నీచం

రేప్ చేస్తానన్న వ్యక్తి జాబ్ ఆఫర్ చేసిన నిర్మాత... మరింత నీచం

ఈ వివాదంలో ‘కసాబా' మూవీ నిర్మాత జోబీ జార్జ్ మరింత నీచంగా ప్రవర్తించాడు. పార్వతిని రేప్ చేస్తానని బెదిరింపులకు పాల్పడి అరెస్ట్ అయిన వ్యక్తికి జాబ్ ఆఫర్ చేశాడు. పార్వతిపై కామెంట్స్ చేసి మంచి పని చేశావ్ అన్న సమర్ధింపు అతడి వ్యాఖ్యలో కనిపించింది. నేను బ్రతికున్నంత వరకు నా వద్ద మంచి జాబ్ చేసే అవకాశం కల్పిస్తాను... అంటూ అరెస్టయిన వ్యక్తికి జాబ్ ఆఫర్ చేశాడు నిర్మాత.

సమాజం ఎటు పోతోంది?

సమాజం ఎటు పోతోంది?

‘కసాబా' నిర్మాత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసిన వ్యక్తుల పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని, అసలు ఈ సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సమాజంలోకి చెడు సంకేతాలు

సమాజంలోకి చెడు సంకేతాలు

సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్స్. తమ సినిమాల్లో మహిళలను కించ పరిచే విధంగా డైలాగులు వాడటం చాలా దారణమని, తన అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నా, నిర్మాత నీచంగా ప్రవర్తించినా మమ్ముట్టి లాంటి స్టార్స్ మౌనం ఉండటం మరింత దారుణమని...... ఇలాంటి సంఘటనల వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెళతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X