హీరోతో అక్రమ సంబంధంపై నోరు విప్పిన నిఖిత

By Bojja Kumar

హీరోయిన్ నిఖితకు, కన్నడ హీరో దర్శన్‌కు మధ్య వివాహేతర అక్రమ సంబంధం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. దర్శన్ భార్య విజయలక్ష్మి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్తలకు మరింత బలం కూరినట్లయింది. నిఖితపై వ్యామోహంతో తన భర్త దర్శన్ నన్ను హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొనడంతో హీరోగారు జైలుకెళ్లాల్సి వచ్చింది కూడా...

అయితే ఈ వ్యవహారంపై ఇంత కాలం మౌనం పాటించిన హీరోయిన్ నిఖిత ఎట్టకేలకు నోరు విప్పింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి... దర్శన్‌కు, తనకు మధ్య అక్రమ సంబంధం లేదని, పవిత్రమైన స్నేహ బంధం మాత్రమే ఉందని పేర్కొంది. పరిశ్రమలో అందరికీ ఈ విషయం తెలుసు, నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారనే విషయం అభిమానులకు కూడా ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని చెప్పింది. ఈ వ్యవహారంతో కొంత మంది నుంచి వేధింపులు ఎదురుకావడంతో మనశ్శాంతి కోసం...అప్పట్లో లండన్ వెళ్లి పోయాను, అక్కడ ఒక బిబిసి రిపోర్టర్ దర్శన్ తో ఎఫైర్ విషయం గుర్తు చేసి రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు అని నిఖిత చెప్పుకొచ్చింది.

నిజానిజాలు తెలుసుకోకుండా కన్నడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తనపై బ్యాన్ విధించడం వల్ల ఎంతగానో కృంగి పోయానని, ఒక మహిళగా అప్పుడు నేనే ఏమీ చేయలేక పోయాను, నిస్సహాయురాలిగా ఉండి పోయాను, అది నా జీవితంలోనే మరిచిపోలేని సంఘటనగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను అర్థం చేసుకోవడం వల్లనే కోలుకోగలిగానని చెప్పారు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తేలిపోయాయని, పరిశ్రమలో కూడా తనపట్ల సానుభూతి పెరిగిందని, ప్రస్తుతం గౌరీ పుత్ర, క్రాంతిపుత్ర సంగోలి రాయన్న అనే కన్నడ చిత్రాల్లో నటిస్తున్నట్లు నిఖిత వెల్లంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X