twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒట్టు...నాకు పగేమీ లేదు

    By Srikanya
    |

    హైదరాబాద్: శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్యన ఏం జరిగిందో తెలియదు కానీ బాద్షా చిత్రం తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే కోన వెంకట్ ...శ్రీను వైట్లపై పగ పట్టాడని మీడియాలో చర్చనీయాంసంగా మారింది. అయితే అదేమీ లేదని కోన మీడియాముఖంగా చెప్తున్నారు. శ్రీను వైట్ల కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కోన వెంకట్ తాజా చిత్రం అంజలి ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    కోన వెంకట్ మాట్లాడుతూ.... 2004లో 'వెంకీ'తో మా ప్రయాణం మొదలైంది. ప్రతి రిలేషన్‌కీ ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మాది 'బాద్‌షా'తో ముగిసింది అంతే. ఆయన లేకుండా నేను బతకగలను... అలాగే నేను లేకుండా ఆయనా బతకగలరు. శ్రీనువైట్ల నుంచి బయటకు వచ్చాకే... నా నుంచి 'బలుపు' వచ్చింది. సో... ఎవరి ప్రయాణం ఆగదు. నేను ఇప్పటికీ చెప్పేది ఒక్కటే. శ్రీను వైట్లపై నాకెలాంటి పగ లేదు. తను కూడా బాగుండాలని కోరుకుంటాను అన్నారు.

    'I don't have revenge on Sreenu Vaitla'

    ఇక కోన వెంకట్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించింది. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు.చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల రెండో వారంలో పాటల్ని విడుదల చేస్తారు.

    కోన వెంకట్‌ మాట్లాడుతూ ''కథపై నమ్మకంతో నేనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకొన్నా. ఆ సమయంలోనే ఎం.వి.వి.సత్యనారాయణ పరిచయమయ్యారు. దీంతో మేమిద్దరం కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గీతాంజలి అనే యువతి జీవితం చుట్టూ సాగే కథ ఇది. ఆ అమ్మాయి ఎవరన్నదే ఆసక్తికరం. ఉత్కంఠ, వినోదం మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. బ్రహ్మానందం పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయనపై ప్రత్యేకంగా ఓ పాట ఉంది. దాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్‌ పాత్రలు కథను మలుపు తిప్పుతాయి. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామ''న్నారు.

    ''అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. అంజలి పాత్రతో పాటు సాయి శ్రీరామ్‌ కెమెరా పనితనం, ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి'' అన్నారు నిర్మాత. రావు రమేష్‌, అలీ, రఘుబాబు, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Noted writer Kona Venkat shared, "I don't have revenge on Sreenu Vaitla. I wish for his success. Our journey started with Venky in 2004 and ended with Baadshah. We decided to part ways and travel separately. After parting ways, I scored success with Balupu."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X