గుట్టు విప్పిన హీరోయిన్: పెళ్లికి ముందే ఫ్రెండ్స్ సెక్స్‌లో...
హైదరాబాద్: లెజెండ్ హీరోయిన్ రాధిక ఆప్టే గత కొన్ని రోజులుగా వరుసగా సెక్స్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన ‘హంటర్ర్' చిత్రం బాలీవుడ్ మంచి విజయం సాధించింది. ఇందులో ఆమె పెళ్లికి ముందు గర్భం దాల్చి, అబార్షన్ చేయించుకున్న పాత్ర చేసింది.
తన పాత్ర గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ...‘హంటర్ర్ చిత్రంలో నేను పోషించిన పాత్ర పెళ్లికి ముందే గర్భం దాలుస్తుంది. అబార్షన్ జరుగుతుంది. ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే పాత్ర. ఈ జనరేషన్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అమ్మాయిలు ఎవరూ సతీసావిత్రిల్లా ఉండటం లేదు. సెక్స్ కోసం పెళ్లి వరకు ఎవరూ ఆగడం లేదు. నా స్నేహితులంతా పెళ్లికి ముందే సెక్స్ సుఖం అనుభవించిన వారే. అలా లేని వారయితే నాకు తెలియదు' అని వ్యాఖ్యాంచింది.

రాధిక ఆప్టే తన స్నేహితుల గురించిన సీక్రెట్స్ చెప్పేయడం హాట్ టాపిక్ అయింది. తన స్నేహితుల గురించి చెప్పిన రాధిక తన గురించి మాత్రం చెప్పక పోవడం గమనార్హం. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. బాలకృష్ణ సరసన లెజండ్, ఇప్పుడు లయిన్ చిత్రాల్లో చేసిన ఈ రక్త చరిత్ర చిన్నది చాలా విషయాల్లో బోల్డ్ గ మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాదల్‌పూర్'లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న రాధికా ఆప్టే... రీసెంట్‌గా రిలీజైన 'హంటర్' సినిమాలో సెక్స్ ఎడిక్ట్‌గా నటించింది. ఆ ఎఫెక్టో లేక సినిమా ప్రమోషన్ కోసమో కానీ... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది.
బదలాపూర్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ సెక్స్ ప్రధానమైన పాత్రలు రావటంతో ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా హంటర్ చిత్రం ప్రోమో వచ్చాక మరీ పరిస్ధితి దారణమైపోయింది. ఆమెను ఎప్రోచ్ అయ్యే నిర్మాతలు, దర్శకులు సాఫ్ట్ పోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది.


Click it and Unblock the Notifications











