»   »  ఐ డోంట్ నో: ‘భరత్ అనే నేను’ కోసం పాటపాడిన బాలీవుడ్ ప్రముఖుడు, మహేష్ థాంక్స్!

ఐ డోంట్ నో: ‘భరత్ అనే నేను’ కోసం పాటపాడిన బాలీవుడ్ ప్రముఖుడు, మహేష్ థాంక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఐ డోంట్ నో: ‘భరత్ అనే నేను’ కోసం పాటపాడిన బాలీవుడ్ ప్రముఖుడు

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించిన 2వ పాట ఏప్రిల్ 1న ఉదయం విడుదలైంది. పెప్పీ ట్రాక్‌తో సాగే ఈ సాంగుకు దేవిశ్రీ ప్రసాద్ మంచి జోష్ ఉన్న ట్యూన్స్‌ జతచేసి అదరగొట్టారు. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పాట పాడింది ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్ పర్హాన్ అక్తర్. ఈ పాట ద్వారా పర్హాన్ టాలీవడ్లోకి అడుగు పెడుతున్నారు.

ఐ డోంట్ నో

పర్హాన్ అక్తర్ పాడిన పాట కావడంతో దీనిపై రెండు మూడు రోజులుగా దేవిశ్రీ ప్రసాద్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. సింగర్ పేరును సస్పెన్స్‌లో పెట్టి బజ్ క్రియేట అయ్యేలా చేశారు. ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ శనివారమే పర్హాన్ పేరు బయట పెట్టిన దేవిశ్రీ..... ఆదివారం ఉదయం 10 గంటలకు ‘ఐ డోంట్ నో' లిరికల్ వీడియోను విడుదల చేశారు. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

థాంక్స్ చెప్పిన మహేష్ బాబు

తన సినిమా కోసం పర్హాన్ పాట పాడటంపై హీరో మహేష్ బాబు థాంక్స్ చెప్పారు. ఈ పాట ద్వారా తెలుగు సినిమాలోకి అడుగు పెడుతున్న ఆయనకు వెల్ కం చెప్పారు. మహేష్ బాబు, పర్హాన్ మధ్య మంచి స్నేహం ఉంది. తన స్నేహితుడు తన సినిమా కోసం పాడటంపై మహేష్ బాబు ఆనందం వ్యక్తంచేశారు.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

మహేష్ బాబు తొలిసారిగా నటిస్తున్న పొలిటికల్ మూవీ ఇది. ఇందులో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న రెండో టీజర్‍‌గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

 జోరుగా ప్రమోషన్లు

జోరుగా ప్రమోషన్లు

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, రవి శంకర్, పోసాని కృష్ణ మురళి, ఆమని, జీవా, బెనర్జీ, బ్రహ్మాజీ, అజయ్ కుమార్, సితార, రజిత, పృధ్వి, దేవరాజ్, యష్ పాల్ శర్మ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో వేడుక ఏప్రిల్ 7న జరుగనుంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
I Don't Know, the second song from Koratala Siva's Bharat Ane Nenu (BAN) starring Mahesh Babu and Kiara Advani, was released on Lahari Music's YouTube channel Sunday, and Farhan Akhtar has made his debut in Tollywood with this track.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X