సన్నీలియోన్ ఎవరో నాకు తెలియదంటూ ఆ హీరోయిన్
ఫోర్న్ స్టార్ సన్నిలియోన్ గత కొద్ది నెలలుగా ప్రతీ రోజు ఏదో ఒక న్యూస్ లో హెలెట్ అవుతూనే ఉంది. అయితే ఆమె ఎవరో తనకు తెలియదంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది బిపాసా బసు. ఆమె బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ''సన్నీలియోన్ ఎవరో నాకు తెలియదు. కానీ మహేష్ భట్ ఒక పాత్రకు ఎవర్నైనా ఎంపిక చేశారంటే కచ్చితంగా దానికో అర్థం ఉంటుంది. ఆ పాత్రకు ఆమె సరిపోతుందనిపిస్తేనే ఆయన తీసుకొని ఉంటారు. కచ్చితంగా సన్నీ మెప్పించే అవకాశాలున్నాయని''అంది. ఇక సన్నిలియోన్ ప్రధానపాత్రలో కనిపించనున్న 'జిస్మ్-2' షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతోంది. రణ్‌దీప్ హుడా, అరుణోదయ్ సింగ్ కీలక పాత్రధారులు. అలాగే సన్నీ లియోన్ మాట్లాడుతూ ''బిపాసా చేసిన 'జిస్మ్' చూశాను. అందులో ఆమె అందంగా ఉంది. బాగా నటించింది.
ఇప్పుడు నేను ఆమె పాత్రకు తగ్గకుండా నటించాలని నిర్ణయించుకున్నాని'' తెలిపింది. ఇక ఎనిమిదేళ్ల కిందట బాలీవుడ్‌లో వచ్చిన 'జిస్మ్' సినిమాతో బిపాసా బసుకు గ్లామర్ భామగా గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా 'జిస్మ్-2' తెరకెక్కబోతోంది. మహేష్ భట్ నిర్మిస్తున్నారు. పూజాభట్ దర్శకురాలు. తొలి చిత్రంలో బిపాసా పోషించిన పాత్రను తాజాగా ఇండో-కెనేడియన్ నీలి చిత్రాల తార సన్నీలియోన్ చేయబోతోంది. ఇప్పటికే ఈమె మీద ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో సంచలనం రేపాయి. బిజినెస్ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











