twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాపై రేప్ జరుగలేదు, జాలి చూపొద్దు: శ్వేతా బసు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వ్యభిచారం కేసులో ఇరుక్కుని, రెస్క్యూ హోంలో గడిపి....తర్వాత జరిగిన విచారణలో ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నుండి క్లీన్ చిట్ పొందిన శ్వాతా బసుపై చాలా మంది జాలి చూపిస్తున్నారు. ఈ జాలి చూపులపై శ్వేతా బసు కాస్త భిన్నంగా స్పందించింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ తనపై చాలా జాలి చూపుతున్నారు. అంతగా జాలిచూల్సిన పని లేదు. నాపై అత్యాచారం లాంటి అఘాయిత్యాలు ఏమీ జరుగలేదని ఆమె వ్యాఖ్యానించారు.

    నా జీవితంలో జరిగిన సంఘటన మామూలు సంఘటన ఏమీ కాదు. నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం అది. ఆ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా కోపం పెంచుకోలేదు అన్నారు. నేను చాలా బాగున్నాను. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే ముందుకు సాగుతాం అన్నారు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెప్పగలను. ఇపుడు నాలో మరింత మనోబలం పెరిగింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది అన్నారు.

    I don't need any sympathy : Swetha Basu

    హన్సనల్ మెహతా అవకాశం మీకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ సంగతి ఏమైంది? అనే ప్రశ్నకు శ్వేతా బసు స్పందిస్తూ...ఇపుడు హన్సల్ మెహతా ప్రాజెక్టు గురించి నేనేం మాట్లాడను. ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్ గురించి ఏదీ ఇంకా ఖరారు కాలేదు. హన్సల్ మెహతా ప్రాజెక్టు అయినా...మరే పాజెక్టు అయినా ఆడిషన్స్ కు హాజరవుతాను. నా సొంత టాలెంటుపై అవకాశాలు సాధించుకుంటాను అన్నారు.

    ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.... ‘రూట్స్' అనే డాక్యుముంటరీ పై పని చేస్తున్నాను. ఇదొక క్లాసికల్ మ్యూజిక్ కు సంబంధించిన డ్యాకుమెంటరీ. ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది పెద్ద వ్యక్తులు ఓకే వేదికపైకి వచ్చారు. ప్రస్తుతం నా జీవితం సంతోషంగా సాగుతోంద అన్నారు.

    English summary
    "Am not a rape victim to show so much sympathy. Please show the sympathy to the needy. It's tough when you come out of comfort zone, but I am glad I faced it and didn't run away from the situation. " Swetha Basu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X