twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాస్టింగ్ కౌచ్: వారి పేర్లు బయట పెడతానని చెప్పి... మాట మార్చిన హీరోయిన్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    కాస్టింగ్ కౌచ్.. వారి పేర్లు బయట పెడతానని చెప్పి...!

    కౌస్టింగ్ కౌచ్.... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమల్లో పలువురు నటీమణులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. చాలా సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా... హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం తర్వాత ఈ విషయంంలో అందరిలోనూ చైతన్యం వచ్చింది. వివిధ సినీ పరిశ్రమల్లో హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి వెల్లడిస్తున్నారు. ఇటీవల కౌస్టింగ్ కౌచ్ అంశంపై బాలీవుడ్ నటి రీచా చద్దా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

     రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తే చాలా విషయాలు చెబుతా

    రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తే చాలా విషయాలు చెబుతా

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రీచా చద్దా స్పందిస్తూ తనతో పాటు, తన కొలీగ్స్ ఎంతో మంది లైంగిక వేధింపులకు గురయ్యారని, రక్షణ కల్పిస్తామన్న హామీ వస్తే, హార్వే వీన్ స్టెయిన్ ఘాతుకాల వంటివి ఎన్నో బయటకు వస్తాయని తెలిపారు.

     పేర్లు బయట పెట్టాలని రీచాపై పెరిగిన ఒత్తిడి

    పేర్లు బయట పెట్టాలని రీచాపై పెరిగిన ఒత్తిడి

    రిచా చద్దా ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఆమెపై ఒత్తిడి పెరిగింది. మీకు రక్షణ కల్పిస్తాం, వారి పేర్లు బయట పెట్టాలని ఆమెకు ఫోన్లు, సందేశాలు వస్తుండటంతో.... ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు.

     మాట మార్చిన రీచా చద్దా

    మాట మార్చిన రీచా చద్దా

    నాకు ఏ రక్షణ అవసరం లేదు. 'నేను' అన్న పదాన్ని ఓ ఉదాహరణగా మాత్రమే ఇంటర్వ్యూలో వాడాను. ఇక ఈ అయోమయానికి స్వస్తి పలకండి. చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.... అంటూ రీచా చద్దా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

     నన్ను వదిలేయండి

    నన్ను వదిలేయండి

    కాస్టింగ్ కౌచ్ అంశంలో తాను బ్లాగులో ఆ వ్యాఖ్యలను తప్పుగా చేశానని, తనను వదిలేయాలని... ఈ సందర్భంగా రీచా చద్దా వేడుకోవడం గమనార్హం.

    English summary
    "I don't need security.I used the 'I' as an example to indicate that whistle-blowers don't have support from the ecosystem.Putting an end to this confusion once n for all.I have nothing to REVEAL.Plz leave me alone abt this.I made the mistake of writing a blog so I wouldn't Be questioned as an authority on the subject of sexual harassment. It's an epdiemic that needs to end but still waiting for a compassionate,thoughtful, concrete discussion on it.All we get is click bait.My film is a hit,is waqt to baksh dijiye sab log." Richa Chadha tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X