»   » మద్యం, సిగరెట్ అలవాటుపై ప్రియా ఆనంద్ స్పందన!

మద్యం, సిగరెట్ అలవాటుపై ప్రియా ఆనంద్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu
I don't smoke, I don't drink - Priya Anand
హైదరాబాద్ : సినిమా రంగంలోకి అడుగు పెట్టిన చాలా మంది హీరోయిన్లు మద్యం, సిగరెట్ లాంటి దురలవాట్ల వైపు ఆకర్షితులవ్వడం, నైట్ పార్టీల్లో మునిగి తేలడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి అలవాట్లు ఉన్న హీరోయిన్ల చుట్టూ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం, వారిపై అనేక గాసిప్పులు ప్రచారంలోకి రావడం షరా మామూలే.

కొందరు హీరోయిన్ల ఇలాంటి అలవాట్లకు బానిసలుగా మారి తమ జీవితం నాశనం చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. పాత తరం హీరోయిన్లు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే హీరోయిన్ ప్రియా ఆనంద్ మాత్రం తనకు ఇలాంటి అలవాట్లు ఏమీ లేవని అంటున్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 'హీరోయిన్ల వెనక వదంతులు వ్యాపించడం మామూలే...కానీ నావెనక అలాంటి రావు. కానీ సిగరెట్ తాగను. మద్యం సేవించే అలవాటు అస్సలు లేదు. పార్టీలకు కూడా దూరంగా ఉంటాను. ఇలాంటి వాతావరణం ఉన్న పంక్షన్లకు నేను దూరంగా ఉంటాను. నేను నటించిన సినిమా పంక్షన్లలో తప్ప మరెక్కడా కనిపించను. అందుకే నా వెనక ఎలాంటి గాసిప్స్ ప్రచారంలోకి రావు' అని చెప్పుకొచ్చారు.

తమిళ నటుడు అధర్వతో షికార్లు చేస్తున్నారనే వార్తలపై స్పందిస్తూ....అధర్వ, గౌతమ్ కార్తీక్, గోపీఆనంద్, విశాల్ సినిమా రంగానికి రాకముందు నుండే స్నేహితుతలం. అందుకే మేము చాలా క్లోజ్ గా ఉంటాం. పోట్లాడుకుంటాం. వీరితో పాటు నాకు బాల్య స్నేహితులు ఉన్నారు అని చెప్పుకొచ్చింది ప్రియా ఆనంద్.

English summary
Priya Anand is a girl who does not have any bad habit. The glitz and glamour attached to her profession have not changed her, as she has kept herself away from drinking and smoking. Well, we are not making this statement rather the actress herself has said that she neither drinks nor smokes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu