మోహన్ బాబు గర్వం అణిగితే నాకు ఆనందం...జూ ఎన్టీఆర్
"మోహన్ బాబు గర్వాన్ని ఎవరూ అణచలేరు. కానీ అదే జరిగితే నేను ఆనందపడతాను" అని ఎన్టీఆర్ అన్నారు. అనగనగా ఒక ధీరుడు చిత్రం ఆడియో పంక్షన్ కి హాజరైన ఎన్టీఆర్ ఆ రకంగా స్పందించారు. ఎన్టీఆర్, మోహన్ బాబు కలిసి గతంలో రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ చిత్రం చేసారు. ఆ చనువు కొద్దీ ఎన్టీఆర్..డైలాగ్ కింగ్ మోహన్ బాబు పై ఈ డైలాగ్ ని వేసారు. అలాగే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ప్రకాష్ ఇంత గొప్ప సినిమా తీశాడని ఆనందంగా ఉంది. నేను అందులో లేనని కుళ్ళుగా ఉంది. నేను ఎప్పుడూ రాఘవేంద్రరావు ఫ్యాన్‌నే అన్నారు. ఇక మోహన్ బాబు గురించి ఆయన కూతుర లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ...మా నాన్న ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఆయన చేతి గోరుకు కూడా మేం సరిపోము. ఈరోజు ఇక్కడిలా మాట్లాడుతున్నానంటే ఆయనే కారణం. కలలు నిజం అవుతాయని ఈ సినిమా నిరూపించింది అన్నారు.
More from Filmibeat
మోహన్ బాబు లక్ష్మి ప్రసన్న జూ ఎన్టీఆర్ అనగనగా ఒక ధీరుడు రాజమౌళి mohan babu laxmi prasanna jr ntr anaganaga oka dheerudu rajamouli


Click it and Unblock the Notifications











