మర్డర్ కేసుపై శ్రీరెడ్డి రియాక్షన్.. శిఖా చౌదరికి మద్దతుగా, హైదరాబాద్‌లో ముసుగేసుకుని!
ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. అతడిని హైదరాబాద్‌లో హత్య చేసి కారులో తీసుకెళ్లి విజయవాడ సమీపంలోని నందిగామ వద్ద వదిలేశారు. ఈ కేసులో రాకేష్ రెడ్డిని ప్రధాన నందితుడుగా ఉన్నారు.
అయితే జయరాం హత్య కేసులో ఆయన మేనకోడలు, టీవీ యాంకర్ శిఖా చౌదరి పేరు మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. శిఖా చౌదరిని టార్గెట్ చేస్తూ వస్తున్న కథనాలపై నటి శ్రీరెడ్డి స్పందించారు. ఈ విషయంలో ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

శిఖా చౌదరికి మద్దతుగా శ్రీరెడ్డి
‘శిఖా చౌదరి ఈ హత్య చేసిందని నేను నమ్మడం లేదు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం మంచిది కాదు. ఆమె ఈ కేసులో అనుమానితురాలు కూడా కాదు' అంటూ శ్రీరెడ్డి తన అభిప్రాయం వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఎంటరైన శ్రీరెడ్డి
ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఇష్యూ తర్వాత శ్రీరెడ్డి హైదరాబాద్ వదిలి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఇల్లు తీసుకుని అక్కడే ఉంటున్నారు. సినిమా అవకాశాలు కూడా వస్తుండటంతో తమిళ సినీ ఇండస్ట్రీలోనే సెటిలవ్వాలని డిసైడ్ అయింది. తాజాగా శ్రీరెడ్డి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

మసుగు వేసుకుని ఎవరూ గుర్తు పట్టకుండా
శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ పేజీలో కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఇరానీ ఛాయ్, పాయా, బిర్యానీ టేస్ట్ చేసేందుకు చార్మినార్ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎవరూ తనను గుర్తు పట్టకుండా ముసుగువేసుకుని కనిపించారు.

మళ్లీ ఏదైనా సెన్సేషన్?
చెన్నైలో ఉంటూనే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ వ్యవహారాలపై సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించే శ్రీరెడ్డి... హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మళ్లీ ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











