»   » బాహుబలి ఇమేజ్ నుండి బయటకు రావాలని లేదు: ప్రభాస్

బాహుబలి ఇమేజ్ నుండి బయటకు రావాలని లేదు: ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
“I Don’t Want To Break Out Of The Image" Prabhas Says బయటకు రావాలని లేదు

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్.... తనకు బాహుబలి ఇమేజ్ నుండి బయటకు రావాలని లేదని, జీవితాంతం ఇదే ఇమేజ్ తో ఉండాలని ఉందని తెలిపారు. 'బాహుబలి' లాంటి చిత్రంలో నటించే అవకాశం ఒక్కసారే వస్తుందని, అలాంటి అవకాశం తనకు దక్కిందన్నారు.

ఈ చిత్రంలో తాను నటించడం నిజంగా ఓ అద్భుతమని, ''బాహుబలి'లో కథానాయకుడిని నేనేనా!' అని ఒకోసారి ఆశ్చర్యపోతుంటానని చెప్పాడు. టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా తనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ చిత్రమే అన్నారు.

ఊహించ లేదు

ఊహించ లేదు

బాహుబలి సినిమాను, తనను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని ఎన్నడూ ఊహించలేదని, ఇది తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంతోషకర విషయం అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

అందమైన అనుభూతి

అందమైన అనుభూతి

‘బాహుబలి' విజయం సాధిస్తుందని ముందే తెలుసు. కానీ ఇంత భారీ విజయం సాధిస్తుందని తెలియదు....ఈ చిత్రం ఓ అందమైన అనుభూతి లాంటిదని ప్రభాస్ వ్యాఖ్యానించారు.

సంచలనం

సంచలనం

ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి ఓ సంచలనం. ఈ దేశంలో అత్యధిక మంది చూసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి దేశం మొత్తం బిత్తరపోయిన సంగతి తెలిసిందే. బాహుబలి రెండు పార్టులు కలిపి రూ. 2 వేల కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రభాస్ ‘సాహో’

ప్రభాస్ ‘సాహో’

ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

English summary
Prabhas, who became popular as the star of the “Baahubali” film franchise, says he doesn’t mind living under its shadow. “I don’t want to break out of the image. This is a once-in-a-lifetime opportunity that I got and I want to keep it all my life,” Prabhas told IANS here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu