కృష్ణ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన మహేష్ బాబు!
సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతా రామరాజు చిత్రం ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకో దగ్గ గొప్ప సినిమాల్లో ఆ సినిమా ఒకటి. తెలుగులో జేమ్స్ బాండ్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న ఘనత కూడా కృష్ణకే చెల్లింది. ముఖ్యంగా ఈ సినిమాల వల్లనే కృష్ట స్టార్ ఇమేజ్ ఓ రేంజిలో పెరిగి ఆ కాలంలో తెలుగు అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందారు. ప్రస్తుతం మహేష్ బాబు కృష్ణ వారసుడిగా, తండ్రిని మించిన తనయుడిగా పరిశ్రమను ఓ ఊపు ఊపుతున్నాడు. ఇది నిజంగా కృష్ణ అభిమానులకు సంతోష కర విషయమే.
అయితే ఓ విషయంలో మాత్రం కృష్ణ అభిమానులకు నిరాశ తప్పడం లేదు. అల్లూరి సీతా రామ రాజు, మోసగాళ్లకు మోసగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేయడానికి, అందులో మహేష్ బాబును హీరోగా నటించిప చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నించారు. అయితే మహేష్ బాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా తనకు రీమేక్ లు చేయడం ఇష్టం లేదని తెగేసి చెప్పాడు మహేష్ బాబు. దీంతో ఇంత కాలం ఆ సినిమాల రీమేకుల కోసం ఎదురు చూస్తున్న కృష్ణ అభిమానుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది.
రీమేక్ సినిమాలు సరిగా ఆడవని, ఒక వేళ ఒరిజినల్ సినిమాల రేంజ్ అందుకోలేక పోతే విమర్శల పాలవుతామనేది మహేష్ బాబు ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో విడుదలైన 3 ఇడియట్స్ రీమేక్ 'స్నేహితుడు' తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పైగా అమీర్ ఖాన్ సినిమాకు జిరాక్స్ అంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. వాస్తవానికి ఈ సినిమాలో మహేష్ బాబును నటింప చేయాలని యోచించారు దర్శకుడు శంకర్. కానీ మహేష్ బాబు అప్పుడు నో చెప్పారు. ఆ సినిమా ఫలితాలు ఇలా ఉంటాయని ముందే ఊహించిన మహేష్ 'స్నేహితుడు' సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని ఇప్పడు స్పష్టం అయింది.


Click it and Unblock the Notifications











