»   » మీ భర్తలు, మీ బాయ్ ప్రెండ్స్ అవసరం లేదు: సన్నీ లియోన్

మీ భర్తలు, మీ బాయ్ ప్రెండ్స్ అవసరం లేదు: సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మాజీ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. ఒకప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించిన భామ కావడంతో మొదట్లో ఆమె ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే కొందరు ఆందోలన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇలాంటి వారు దేశంలో ఉంటే.... ఇక్కడి వారు చెడిపోతారు, ఆమెను ఇండియన్ సినిమాల్లో నటించనివ్వొద్దు అని డిమాండ్ చేసిన వారు సైతం ఉన్నారు. అప్పట్లో సన్నీ లియోన్ తో పాటు నటించడానికి పలువురు బాలీవుడ్ స్టార్లు భయ పడేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

I don’t want your husband or boyfriend: Sunny Leone

అయితే....సన్నీ లియోన్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించడం, అవి మంచి విజయం సాధించడం, ఆమె చిత్రాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడిన తర్వాత పరిస్థితులో కొద్దికొద్దిగా మార్పు వస్తోంది. సన్నీ లియోన్ తో కలిసి పని చేయడానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

అయితే.... సన్నీ లియోన్ కలిసి సినిమా చేయడం అంటే సదరు బాలీవుడ్ స్టార్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ అభద్రత భావానికి గురవుతున్నారట. ఈ విషయమై సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘నాతో పాటు కలిసి పని చేస్తున్న యాక్టర్లలో చాలా మంది పెళ్లయిన వారే. వారు నాతో పని చయడం వల్ల ఇన్ సెక్యూర్ ఫీలింగుకు గురవుతున్నట్లు గమనించాను. వారి భర్తలు లేదా బాయ్ ఫ్రెండ్స్‌ను నేనేమీ సొంతం చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మోస్ట్ అమేజింగ్ హస్బెండ్ నాకు ఉన్నారు' అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు.

English summary
"Most of the actors I work with are married, and when I meet their wives, I usually get along with them more than the boys. But still, I do believe that there is some insecurity for sure. I just feel like telling them, “I don’t want your husband or boyfriend. I have the most amazing husband in the world." Sunny Leone said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu