ఆ..భయంతోఃనే బికినీకి నో చెప్పిన మినిషా
అప్పట్లో వచ్చిన 'కిడ్నాప్" సినిమా ద్వారా బికినీ ధరించి కనువిందు చేసిన ఈ కాశ్మీరీ సుందరి మినిషా లాంబ...తన తాజా సినిమా 'హమ్ తుమ్ షబానా" కోసం మాత్రం నో అంటోంది. ఈ కాలంలో బికీనీ వేయక పోవడం ఏమిటి? ప్రియాంక, కరీనా, బిపాస లాంటి వారికంటే నువ్వేమైనా గొప్పా? అని పలువరు ఎత్తి పొడుస్తున్నా...నా భయం నాది. బికినీ వేయనంటే వేయనంటోంది. ఇంతకీ అమ్మడు భయమేంటో తెలుసా...ఓసారి బికినీల్లో కనిపించడం మొదలుపెడితే తదుపరి సినిమాల్లోనూ ఇదే పనిచేయాల్సి ఉంటుందనే భయమే ఈ 26 ఏళ్ల సుందరి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.
వాస్తవానికి ఈ సినిమాలో మినిషా.... స్క్రిప్టు ప్రకారం అందాల పోటీల్లో పాల్కొనాలి, ఇందులో భాగంగానే స్విమ్ షూట్ ధరించాలి. కానీ స్ర్కిప్టు డిమాండ్ చేసినా తాను బికినీ ధరించలేనని దర్శకుడు సాగర్ బెల్లారీకి బల్లగుద్దీ మరీ చెప్పింది. అవసరమైతే ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి సిద్ధమయింది. 'అయితే సాగర్ సానుకూలంగా స్పందించాడు. బికినీ, స్విమ్‌సూట్ లేకుండానే షూటింగ్‌ను పూర్తిచేశారు. ప్రేమకథా హాస్యచిత్రమైన హమ్ తుమ్ షబానా ఈ నెల 23న విడుదలవుతోంది. మినిషా సహా శ్రేయస్ తల్పడే, తుషార్ కపూర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











