twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.: కమల్ హాసన్

    By Srikanya
    |

    బెంగుళూరు : నేను భారతీయునిగా ఉండేందుకు ఇష్టపడతా. విశ్వరూపం విడుదల సమయంలో సంకుచిత మనస్తత్వాలు బాధించిన మాట వాస్తవమే అయినా నేను భారత దేశంలోనే ఉండేందుకు ఇష్టపడతా. నా చిత్రాల విడుదలలో రాజకీయాల ప్రమేయం ఉందని నేను భావించటం లేదు. ప్రతి చిన్న విషయానికి రాజకీయాలను ముడిపెట్టడం సరికాదు. నేను చేసిన చిత్రాల పట్ల ఏ ఒక్కరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. శనివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ నిర్వహించిన 'మీట్‌ ద ప్రెస్‌' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    నా చిత్రాలను సమాజానికే అంకితం చేస్తా. గతంలో సినిమాలు తీయాలంటే కథ, కథాగమనం, క్యారెక్టర్‌ పట్ల అవగాహన ఉంటే చాలనుకున్నా. కానీ ప్రస్తుతం అన్నింటికీ మించిన చతురత అవసరమని భావిస్తున్నా. ఫిక్కి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌ సమితి అధ్యక్ష హోదాలో ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరులో జరిగే ఓ సదస్సులో 'సినిమా పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం' అనే అంశంపై ప్రసంగిస్తాను.


    మహాత్మాగాంధీ పట్ల తనకున్న దురభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకొని ఇక నుంచీ గాంధేయవాదిగానే కొనసాగుతానని ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. గాంధేయవాదం, చిత్రరంగం, సినిమాల్లో రాజకీయాల ప్రమేయం, తదితర అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు. గతంలో కొందరి చెప్పుడు మాటల వల్ల గాంధీ పట్ల ఒక దశలో దురభిప్రాయం కలిగింది. ఆ సమయంలోనే హేరామ్‌ చిత్రం తీశా. అయితే ఆయన పట్ల నాకున్న భావన తప్పని త్వరలోనే తెలుసుకున్నా.

    గాంధీ ఎప్పటికీ గొప్ప వ్యక్తే. గాంధీ స్థాపించిన భారతీయ వాణిజ్య సమాఖ్య (ఫిక్కి) అనుబంధ సంస్థ ఫిక్కి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌ సమితికి అధ్యక్షునిగా ఆనందంగా విధులు నిర్వర్తిస్తా. ఈ హోదాను దక్షిణాది సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సమర్థంగా వినియోగించుకొంటా. గత పదేళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న భారతీయ సినీ పరిశ్రమకు నా వంతుగా సరికొత్త మార్పులు అద్దాలని భావిస్తున్నా.

    అలాగే ప్రస్తుతం హాలీవుడ్‌ సినీ పరిశ్రమ సాంకేతిక హంగులతో ఓ కుగ్రామంగా మారింది. అంతే సామర్థ్యం కలిగిన భారతీయ చలన చిత్ర పరిశ్రమ మాత్రం వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో అనుభవంతోనే నటన మెరుగుపడుతుండేది. కానీ ఇప్పుడు ఏ మాత్రం అనుభవం లేని వారు కూడా సహజసిద్ధంగా నటిస్తున్నారు.

    ఇందుకు నేను తీసిన విశ్వరూపం సినిమానే సాక్ష్యం. అందులో దాదాపు 80 శాతం మంది నటులు అనుభవం లేని వారే. అయితే సాంకేతికత అనేది కథను మింగే వస్తువుగా మారకూడదు. నా నటనా ప్రస్థానం సవాళ్లతోనే సాగుతోంది. ప్రతి దశలో నాకు ప్రేక్షకుల అభిరుచే పెద్ద సవాలు. సినిమా విడుదలకు ముందే శాటిలైట్‌ హక్కుల అమ్మకం మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు ఆనవాలు.

    English summary
    “It is fine to stain the tip of your finger when you cast your vote. I do not wish to stain my entire hand,” said actor Kamal Haasan, speaking about why he would never consider entering electoral politics. Asked about his opinion on Narendra Modi being chosen the BJP prime ministerial candidate for the Lok Sabha elections next year, he said he would express it “in a closed box where no one is looking.” Interacting with the media on Saturday, Haasan encouraged the Kannada film industry to open its doors for business from outside.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X