అంత పతివ్రతనేం కాదు...
మీరు తెరపై చూసినంత బుద్దిమంతురాలిని,నీతిమంతురాలని మాత్రం నిజ జీవితంలో నేను కాదు అంటోంది కొంకణా సేన్ శర్మ. ఆమె తాజాగా మీడియా తో మాట్లాడుతూ తమ అభిమానులు తాము తెరపై ధరించే పాత్రలు చూసి తమను ఎంతగానో ఊహించుకుంటారని అటువంటిదేమో రియల్ గా ఉండదని, తాము అందరిలాంటివాళ్ళమేనంటోంది. నిజజీవితంలో నేనంత నీతిమంతంగా ఏమీ ఉండను. నాకు నచ్చినట్లుగా నేనుంటాను అంటూ ఎంతో నిజాయితీగా ప్రకటించుకుంటోంది కొంకణాసేన్ శర్మ. ప్రముఖ బెంగాళీనటి ,దర్శకురాలు అపర్ణాసేన్ కుమార్తె అయిన ఈమె ఇలా బహిరంగంగానే 'నేను మరీ అంత నీతిమంతురాల్ని కాను" అని ప్రకటించటం పై బాలీవుడ్ లో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అలాగే నా పాత్రలు చూసి నన్ను అంచనా వేయవద్దని కోరుతోంది. ఉదాహరణకు పేజ్ త్రి సినిమాలో తన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. అంతేగాక చాలా నీతివంతంగా, పద్ద్దతిగా, ఉన్నతంగా ఉంటుంది. దానికి పూర్తి వ్యతిరేకం నా లైఫ్ స్టయిల్ అంటోంది ఇరవై తొమ్మిదేళ్ళ కొంకణా. అయినా అదేంటో గానీ నాకు దగ్గరకు వచ్చే పాత్రలన్నీ అలా ఉండేవే. అప్పుడప్పుడూ కాస్త డిఫెరెంట్ గా ఉండాలని ఆ తరహా పాత్రలు కోసం అన్వేశిస్తాను..కానీ పెద్దగా ఫలితం ఉండదు అంటోదీమే.బోయ్ ప్రెండ్స్ తో తిరగటం,డేటింగ్ వంటివి మామాలే అని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చిన ఈ ముధ్దుగుమ్మ వృత్తి పరంగా మాత్రం చాలా ప్రొఫిషనల్ గా వ్యవహిరించటం, ఏ పాత్ర అయినా క్షణాల్లో లీనమవటం ఆమె కున్న ప్లస్ పాయింట్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











