ఏ గ్రూప్ కి చెందను..రామ్
దిల్ రాజు సినిమాలో నా రోల్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. రూరల్ ఏరియాలో ఉండే ఓ చురుకైన కుర్రాడిగా చేస్తున్నాను. ఇప్పటివరకూ అలాంటి పాత్రను చేయలేదు. అయినా మొదటి నుంచీ నేను ప్రత్యేకమైన రోల్స్ చేస్తూనే ఉన్నాను. అలాగే రెడీ ప్యామిలీ ఎంటర్టైనర్, మస్కా లవ్ స్టోరీ,ఇక నా రెండో సినిమా జగడం అయితే ఓ ఆఫ్ బీట్ ఫిలిం. నేను చేసే ప్రతీ పాత్రా నా లోని నటుడుని వెలికితీస్తూనే ఉంది.అందులోనూ నేను త్వరగా బోర్ ఫీలవుతాను. ఛాలెంజ్ గా ఉండే స్క్రిప్టులే ఎంపిక చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. అలాగే అందరూ భావిస్తున్నట్లుగా నేను ఏ క్యాంప్ కీ చెందిన వాడిన కాదు...నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. కేవలం నా హార్డ్ వర్స్ తోనే నా విజయం ఉంటుంది. ఇక ఈ 21 ఏళ్ళ కుర్రాడుకీ తెలుగు సినిమాల్లో నటించటమొకటే ఎజెండా కాదట. నాకు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంటర్ అవ్వాలని ఉంది. నా మొదట సినిమా అక్కడే చేద్దామనుకున్నా. అయితే మా అంకుల్ స్రవంతి రవికిషోర్ పట్టుదలతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చాను. అన్నీ కలిసివస్తే త్వరలోనే తమిళ పరిశ్రమకు ఎంట్రీ ఇస్తాను అని ధీమా వ్యకం చేస్తున్నాడు. రీసెంట్ గా రామ్ హీరోగా చేసిన గణేష్ చిత్రం భాక్సాఫీస్ వద్ద కుదేలుమంది.తాజాగా లక్ష్యం శ్రీ వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











