బీర్ తాగిన హీరోయిన్: నచ్చిందట, కానీ ఆ విషయమే భయంగా ఉందని!..
Recommended Video

బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'క్వీన్' చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళంలో మంజిమా మోహన్, తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడలో పరుల్ యాదవ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
క్వీన్ తెలుగు, మలయాళ వెర్షన్స్‌కి నీలకంఠం దర్శకత్వం వహిస్తుండగా తమిళ, కన్నడ వెర్షన్స్‌కి రమేష్ అరవింద్ దర్శకుడు. మలయాళంలో ఈ సినిమాకు 'జామ్ జామ్' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా మలయాళ చిత్రీకరణ గురించి హీరోయిన్ మంజిమా మోహన్ పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.

ఆ విషయంలో కాస్త భయంగా:
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన క్వీన్ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలనుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని అన్నారు మంజిమా మోహన్. క్వీన్‌లో కంగనా నటన చూసినవాళ్లంతా.. ఆమెకు సరిసమానంగా నటిస్తానా? లేదా? అన్నది చూస్తారని, ఆ విషయంలో కాస్త భయంగానే ఉందని అన్నారు. అయితే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.

బీరు తాగే సన్నివేశం నచ్చింది:
రీమేక్ సినిమానే అయినప్పటికీ.. బాలీవుడ్ 'క్వీన్'కు మలయాళ రీమేక్ కు చాలా తేడా ఉంటుందంటున్నారు మంజిమా. సన్నివేశాలను కాపీ కొట్టడం లేదని చెబుతూ ఒక సీన్ చిత్రీకరణ గురించి వివరించారు. 'సినిమాలో నేను బీరు తాగే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. షాట్ కూడా చాలా బాగా వచ్చింది' అని అన్నారు.
సినిమా షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు సరిగా చేస్తానో.. లేదోనని చాలా భయపడ్డానని, కానీ షూటింగ్ జరుగుతున్న కొద్దీ ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. సహజ నటనతో కూడుకున్న పాత్ర కావడంతో ఇదొక సవాల్ లాంటిదేనని చెప్పారు. కొన్నిసార్లు ఒక్కో సీన్‌కు ఐదారు టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

అలా ఎప్పుడూ చెప్పలేదు:
ఒకే సినిమాను ఇద్దరు హీరోయిన్లతో వేర్వేరే భాషల్లో ఒకే దర్శకుడు తెరకెక్కిస్తుండటంపై మంజిమా స్పందించారు. తెలుగులో తమన్నాతో, మలయాళంలో తనతో క్వీన్ రీమేక్ ను తెరకెక్కిస్తున్న నీలకంఠ.. ఎప్పుడూ తన పెర్ఫామెన్స్ ను తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. 'తమన్నా చాలా బాగా చేశారు.. మంజిమా చేయలేకపోయారు' అని ఆయన అన్న సందర్భం లేదన్నారు.

అప్పటిదాకా సినిమా చూడలేదు:
క్వీన్ రీమేక్ 'జామ్ జామ్' కోసం తొలిసారి తాను ఫ్రాన్స్ వెళ్లానని, సినిమా కోసం అంత దూరం వెళ్లడం ఇదే మొదటిసారి అని మంజిమా చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా అన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదన్నారు. సినిమా షూటింగ్ కు రెండు రోజుల ముందు స్క్రిప్ట్ చదివానని, అప్పటికీ తాను 'క్వీన్' సినిమా చూడలేదని అన్నారు. ఫ్రాన్స్ నుంచి తిరిగొచ్చాక సినిమా చూసినట్లు చెప్పారు.

మావాళ్లకు ఇష్టం లేదు:
తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు మంజిమా. 14ఏళ్ల వయసు నుంచే తాను నటిస్తున్నట్లు చెప్పారు. చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి వెళ్లాలని తల్లిదండ్రులు కండిషన్ పెట్టడంతో చదువు కోసం సినిమాకు దూరమైనట్లు చెప్పారు.
తాను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపారు. ఏదో ఒకటి చదవాలి కాబట్టి.. మ్యాథ్స్ ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమాలు సరిగా ఆడకపోయినంత మాత్రానా వాటి గురించే పదేపదే ఆలోచించనని, మరింత కష్టపడటానికి ప్రయత్నిస్తానని తెలిపారు.


Click it and Unblock the Notifications











