twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆ ఫ్లాప్ ని నేను బాగా ఎంజాయ్ చేసా': శర్వానంద్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మనకున్న మంచి నటుల్లో శర్వానంద్ ఒకరు. ఆయన ఆ మధ్య నిర్మాతగా మారి కో అంటే కోటి అనే చిత్రం నిర్మించారు. తనే హీరోగా చేసిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏదో విభిన్నత చూపాలనే తపనతో చేసిన ఆ ప్రయత్నం ఫలించకపోవటంతో ఆయన అప్పట్లో నిరాశచెందారు. అయితే ఇప్పుడు ఆయన మరో చిత్రం నిర్మిస్తానని, ఆ ఫ్లాఫ్ ని తాను బాగా ఎంజాయ్ చేసానని చెప్తున్నారు.

    శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ... "'కో అంటే కోటి' విషయమై నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను. నేను దాని నుంచి చాలా నేర్చుకున్నాను. వాస్తవానికి నాకు అలాంటి జోల్ట్ తగలాలి. అది నన్ను ఆనందపరిచిన ఓ స్వీట్ ఫెయిల్యూర్ . అయినా నేను భవిష్యత్ లో నా ప్రొడక్షన్ లో సినిమాలు తీసే ఆలోచన ఉంది. " అన్నారు. ఈ సినిమా వల్ల నాకు లాభమొచ్చిందా, నష్టమొచ్చిందా అనే విషయం పక్కన పెడితే ఓ విషయంలో జ్ఞానోదయమైంది. సినిమా నిర్మాణం ఎంత కష్టమో, నిర్మాత పరిస్థితి ఏమిటో అర్థమైంది. అయినా మళ్లీ సినిమా తీస్తాను. అయితే ఇప్పుడు కాదు. నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తా అన్నారు.

    నాని నిర్మాత అవటం గురించి మాట్లాడుతూ.."నాని నిర్మాత కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అతను ఖచ్చితంగా మంచి స్క్రిప్టులు ఎంపికచేసుకుని సక్సెస్ అవుతాడనే భావిస్తున్నాను. అన్నీ బావుంటే మేము కలిసి పనిచేయవచ్చు. నా ప్రొడక్షన్ లో అతను కానీ అతను ప్రొడక్షన్ లో నేను కానీ చెయ్యవచ్చు...ఏదైనా జరగవచ్చు." అన్నారు.

    ఆయన వర్మ దర్శకత్వంలో పూర్తైన సత్య 2 ప్రాజెక్టు గురించి చెప్తూ...'కో అంటే కోటి' షూటింగ్ టైమ్‌లో ఆయన్ని కలిశాను. అప్పుడే 'సత్య 2' కథ చెప్పారు. నేను బాగా ఇంప్రెసయ్యా. ఏదో కథ చెప్పారనుకున్నాగానీ, అందులో నన్నే హీరోగా తీసుకుంటున్నారని నాకు తెలీదు. తెలిశాక చాలా షాకయ్యాను. వర్మ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు అన్నారు.

    తమిళంలో నాకు బాగానే క్రేజ్ వచ్చినచ్చింది. తెలుగులో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇంతకుముందు మురుగదాస్ నిర్మాణ సంస్థలో 'జర్నీ' చేశా. ఇప్పుడేమో ప్రముఖ దర్శకుడు చేరన్‌తో చేస్తున్నా. తమిళం కూడా నేర్చుకున్నా. డబ్బింగ్ కూడా చెప్పాలనుకుంటున్నా అన్నారు. చెన్నైలో స్థిరపడతానా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేను. నటుడనే వాడు ఏ భాషలో అవకాశమొచ్చినా చేయాలి కదా. నేనూ అంతే అన్నారు.

    English summary
    Sharwanand says that... "I was super happy for it. I've learnt a lot from it. Actually that jolt was needed for me then. It was a sweet failure that made me happy. And of course, I'm going to continue my production plans in future too."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X