నాన్నను అలా చూడటం సంతోషం: నాగ్
నాన్నను వాల్మీకి పాత్రలో చూడటం సంతోషంగా ఉంది ఉంది అంటూ తన మనసులోని మాటను వెలుబుచ్చారు అక్కినేని నాగార్జున. నందమూరి బాలకృష్ణ లార్డ్ రామాగా నటించిన శ్రీరామ రాజ్యం సినిమాలో నాగ్ తండ్రి అక్కినేని వాల్మీకి పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో నాగార్జున పై వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి ప్రసద్ ల్యాబ్స్ లో ప్రదర్శించిన శ్రీరామ రాజ్యం ప్రీమియర్ షోకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, అక్కినే కుటుంబ సభ్యలంతా హాజరయ్యారు.
బాపు దర్శకత్వం వహించిన శ్రీరామ రాజ్యం సినిమా ఈ రోజు(వంబర్ 17)న విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది. శ్రీసాయి బాబ మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బాలయ్య లార్డ్ రామాగా నటించగా, సీత పాత్రలో నయనతార నటించింది. ఎఎన్ఆర్ వాల్మీకి మహర్సి గాను, శ్రీకాంత్ లక్ష్మణుడి పాత్రలో కనిపించారు. ఇలయరాజ అందించి సంగీతం ఇప్పటికే సూపర్ హిట్టయింది.


Click it and Unblock the Notifications











