మొత్తానికి రాజమౌళి సర్ ని కలిసా..సమంత
ఏ మాయ చేసావె చిత్రంతో పరిచయమైన సమంత తాజాగా ట్విట్టర్ లో తాను ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కలిసానంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్స్ లోనే...ఇవాళ నేను ఫైనల్ గా రాజమౌళి సర్ ని కలిసాను. ఆయన మా సెట్ పై ఉన్నారు. నేను ఆయనతో చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఫన్నీ ఏమిటంటే కేవలం హాయ్ సర్..నేను మీకు పెద్ద ప్యాన్ ని అన్నా..హిహిహి అంది. ఇక జూ ఎన్టీఆర్ వేసిన స్టెప్ గురించి చెబుతూ...మేస్ట్ ఎమేజింగ్ స్టెప్ ని నేను చూసాను. ఇనుమలాంటి మనిషి తారక్..ట్రూలీ పెంటాస్టిక్..మీరు ఈ సాంగ్ బాగా ఇష్టపడతారు. అలాగే నేను ఫోక్ స్టైల్ లో ఈ పాటలో ఉంటాను. ఇది మోస్ట్ కమర్షియల్ సాంగ్..నేను జెస్సీలా అనిపించను అని ఊరిస్తోంది. ఇదంతా ఆమె బృందావనం సెట్స్ మీద పాట షూటింగ్ లో ఉన్నప్పుడు జరిగిన అనుభూతులు గురించి చెబుతూ స్పందించింది.
రాజమౌళి సమంత ఏ మాయ చేసావె జూ ఎన్టీఆర్ బృందావనం samantha jr ntr brindavanam rajamouli maryada ramanna


Click it and Unblock the Notifications