నేనెంత అదృష్టవంతురాలినో అంటూ ఎగిరి గంతేస్తున్న ఆసిన్
బాలీవుడ్‌లో అవకాశాలు తన్నుకు వస్తుంటే దక్షిణాది తార ఆసిన్ ఎగిరి గంతేస్తోంది. మూడేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆసిన్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో నటించింది. తాజాగా అక్షయ్ కుమార్ సరసన హౌస్‌ఫుల్ సినిమాలో నటిస్తోంది. అటువంటి అవకాశాలు రావడం తన అదృష్టమని చెబుతోంది. తాను ఎంతో అదృష్టవంతురాలినని, ఎందుకంటే విజయానికి పలు అంశాలు పనిచేస్తాయని ఆమె అన్నది. ప్రతిభ, క్రమశిక్షణ ఉండాలని, అయితే దానికి ఎక్స్ ఫ్యాక్టర్ కూడా అవసరమని అంటోంది.
ఎక్స్ ఫ్యాక్టర్ అంటే అదృష్ణం కావచ్చు, దేవుడి దయ కావచ్చు, చుట్టూ ఉండే మనుషుల ఆశీస్సులు కావచ్చు, ఎలాగైనా చెప్పుకోవచ్చునని అంటోంది. అదే లేకపోతే తనకు పెద్ద హీరోల సరసన నటించే అవకాశం వచ్చి ఉండేది కాదని చెబుతోంది. అమీర్ సరనస గజిని సినిమాలో, సల్మాన్ ఖాన్ సరసన లండన్ డ్రీమ్స్, రెడీ సినిమాల్లో ఆసిన్ నటించింది.


Click it and Unblock the Notifications











