జీవితను చూస్తే ఒళ్లుమండేది, ఆమెను వద్దనుకున్నా: రాజశేఖర్

ఇటీవల ఓ కార్యక్రమంలో నటుడు రాజశేఖర్ తన భార్య జీవిత గురించి మాట్లాడారు. ఒకప్పుడు జీవిత టాలెంట్ చూసి తన ఒళ్లుమండేది, ఈర్ష్య పడేవాడిని అని తెలిపారు.

By Bojja Kumar

జీవిత- రాజశేఖర్... టాలీవుడ్లోని ఆదర్శ దంపతుల్లో ఈ జంటది ప్రత్యేక స్థానం. పాతికేళ్ల వీరి దాంపత్య జీవితంలో ఏనాడూ ఎలాంటి పొరపొచ్చాలు పొడచూపలేదు. జీవిత నా సర్వస్వం, ఆమె నా వెనక ఉన్న బలం అని రాజశేఖర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

Recommended Video

రాజశేఖర్‌పై ఫ్యాన్స్ కామెంట్.. కంటతడి పెట్టిన జీవిత

అయితే ఒకప్పుడు జీవితను చూస్తే రాజశేఖర్ ఒళ్లు మండేదట. విపరీతమైన కోపం ఉండేదట. ఓసారి ఆమెను సినిమాలో హీరోయిన్‌గా తీసుకుందాము అని చెబితే.... వద్దని చెప్పారట ఈ యాంగ్రీయంగ్‌మెన్.

జీవితను వద్దనుకున్నా

జీవితను వద్దనుకున్నా

హౌస్ సర్జన్ పూర్తయినా తర్వాత సినిమా మీద వ్యామోహంతో ఈ రంగం వైపు వచ్చాను. 'హలో యారు పేసరేది' సినిమా సెట్స్‌లో తాను తొలిసారి జీవితను కలిశానని రాజశేఖర్ తెలిపారు. ఆ సినిమాలో జీవితను హీరోయిన్ గా తీసుకుందామా? అని దర్శక నిర్మాతలు అడిగితే... ఈ పాత్రకు ఆమె సూట్ కాదేమో అని చెప్పాను. నెక్ట్స్ డే నా ఇంటికి కారు రాలేదు. సినిమా నుండి నన్ను తీసేశారని తెలిసింది... అని రాజశేఖర్ తెలిపారు.

జీవిత నన్ను కావాలనుకుంది

జీవిత నన్ను కావాలనుకుంది

'హలో యారు పేసరేది' తర్వాత 'తలంబ్రాలు' సినిమా సమయంలో మళ్లీ జీవితను కలిశాను. తనను సినిమా నుంచి తీసేసిన విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా జరిగిన విషయాన్ని ఆమె తనకు చెప్పింది. 'హీరో బాగున్నారా లేక మార్చేద్దామా?' అని జీవితను దర్శక నిర్మాతలు అడిగారని... దీనికి సమాధానంగా 'మంచి నటుడు, సినిమాలో పెట్టుకుందాం' అని దర్శకుడికి చెప్పానని జీవిత తనతో చెప్పింది. నేను ఆమెను వద్దనుకున్నా... ఆమె నన్ను కావాలనుకుంది అని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు.

జీవితను చూస్తే ఒళ్లు మండేది

జీవితను చూస్తే ఒళ్లు మండేది

‘‘తలంబ్రాలు' చిత్రంలో విలనే హీరో. ఆ సినిమా చేస్తున్నప్పుడు జీవిత ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్‌ టేక్‌లో చెప్పేది. నేను మాత్రం రెండు, మూడు టేక్‌లు తీసుకునేవాడిని. ఈ అమ్మాయి ఇలా చెప్పేస్తోంది ఏంటి? అని జీవిత మీద కోపంతో ఒళ్లు మండిపోయేది.... అని రాజశేఖర్ అలీతో జాలీగా కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.

నన్ను తిట్టుకుంటారుకున్నా, రివర్సయింది

నన్ను తిట్టుకుంటారుకున్నా, రివర్సయింది

‘తలంబ్రాలు' సినిమాలో మేము చేసిన పాత్రల పరంగా జీవితకు మంచి పేరు వస్తుందనుకున్నా, నన్ను తిట్టుకుంటారనుకున్నా. కానీ అంతా రివర్స్‌ అయంది. జీవితకంటే నాకే మంచి పేరు వచ్చింది. ఓ అమ్మాయి థియేటర్‌లోనే నన్ను కిస్‌ చేసిందని రాజశేఖర్ అన్నారు.

లవ్ లో ఫెయిల్ అయ్యాను

లవ్ లో ఫెయిల్ అయ్యాను


‘'చదువుకునే రోజుల్లో నాకంటే ఐదేళ్ల పెద్ద వయసున్న అమ్మాయిని ప్రేమించా. పెళ్లి చేసుకోవాలనుకున్నా. అది ఫెయిల్‌ కావడంతోనే నాకు సిగరెట్‌, మందు అలవాటైంది. దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఫ్రెండ్స్ చెబితే గుడికి వెళ్లా. ‘సారీ దేవుడా నేను తాగి ఉన్నా. నేను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్‌ వ్యూ చెబితే నిన్ను నమ్ముతా' అని అన్నా. మూడు నెలల తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్‌ వ్యూ చెప్పిందని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X