twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూలపై బూతులు.. ప్రస్టేషన్‌లో వీరభోగ డైరెక్టర్.. చేతులెత్తేసిన హీరో శ్రీవిష్ణు..

    |

    నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన 'వీర భోగ వసంత రాయలు '. ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి నెగెటివ్ రెస్పాన్స్ రావడం, యావరేజ్ రేటింగుతో రివ్యూలు రావడం తెలిసిందే.

    కొన్ని సార్లు సిగరెట్, మందు తప్పడం లేదు... ప్రతి డైరెక్టర్ అంతే: శ్రీయకొన్ని సార్లు సిగరెట్, మందు తప్పడం లేదు... ప్రతి డైరెక్టర్ అంతే: శ్రీయ

    'వీర భోగ వసంత రాయలు ' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఇంద్రసేన తన సినిమాపై విమర్శలు రావడాన్ని జీర్ణించుకోలేక ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయారు. 'ఫక్ రివ్యూస్.... థియేటర్లకు వచ్చి అసలైన కల్ట్‌ మూవీ ఆస్వాదిచండి' అంటూ హీరో శ్రీవిష్ణు ఫోటో కూడిన పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.

    శ్రీవిష్ణు పోస్టర్‌తో అభ్యంతరకంగా

    శ్రీవిష్ణు పోస్టర్‌తో అభ్యంతరకంగా

    ‘ఫక్ రివ్యూస్' అంటూ బూతులు వాడుతూ సినీ విమర్శకుల మీద జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయడం, అది కూడా తన పోస్టర్‌తో ఇలాంటివి చేయడం హీరో శ్రీవిష్ణుకు ఆగ్రహం తెప్పించింది. దర్శకుడు, చిత్ర బృందం వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా నివారణ చర్యలు చేపట్టారు. దీంతో శ్రీవిష్ణు ఫోటోతో ఉన్న ఫక్ రివ్యూస్ పోస్టర్ తొలగించారు.

    రివ్వూలను గౌరవిస్తాను అంటూ శ్రీవిష్ణు ట్వీట్

    రివ్వూలను గౌరవిస్తాను అంటూ శ్రీవిష్ణు ట్వీట్

    చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా శ్రీవిష్ణు స్పందించారు. ‘వీర భోగ వసవంత రాయలు' సినిమా విషయంలో రివ్యూలను, అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. త్వరలోనే నా నెక్ట్స్ ప్రాజెక్టుతో కలుద్దాం. మీ విషెస్ నాకెప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

    హిమాలయాలకు వెళుతున్నట్లు

    ఇంటలెక్చువల్స్ అని ఫీలయ్యే రివ్యూవర్లకు నా సినిమా అర్థం కాలేదు అంటూ క్లాస్ పీకే ప్రయత్నం చేసిన ఇంద్రసేన... హిమాలయాలు నన్ను పిలుస్తున్నాయంటూ ట్వీట్ చేశారు.

    అన్నా అని పిలిచిన వ్యక్తిని హౌలే అంటూ...

    అన్నా అని పిలిచిన వ్యక్తిని హౌలే అంటూ...

    హిమాలయాలకు వెళుతున్నట్లు ఇంద్రసేన్ ట్వీట్ చేయడంతో.... ఓ అభిమాని ‘అంటే అండర్ గ్రౌండా?' అంటూ వెటకారంగా కామెంట్ చేశారు. దీంతో ఫ్రస్టేషన్‌కు గురైన ఇంద్రసేన అతడిని హౌలే అని సంభోధిస్తూ హిమాలయాలు అంటే టాప్ ఆఫ్ ది వరల్డ్. అంటే నేను కూడా టాప్‌లో ఉన్నానని అర్థం అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ ‘అన్నా అని పిలిచినోడిని హౌలే అని సంభోదించినపుడే నీ వ్యక్తిత్వం ఏమిటో అర్థం అయింది' అంటూ పంచ్ ఇచ్చాడు.

    English summary
    "I genuinely respect all the reviews and opinions for #VBVR...I will see you soon with my next project... hope your wishes are with me as always." Sree Vishnu Tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X