twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ... పని చేయడానికి తాప్సీకి‌ లైసెన్స్ ఇచ్చేసారు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ తాప్సీ వెండితెరపై అటు బిజీగా ఉంటూనే తన జీవితంలోని డ్రీమ్స్‌ను నిజం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ పొందింది. ఇప్పుడు తాప్సీ లైసెన్స్డ్ స్కూబా డైవర్. సముంద్రం లోతుల్లో విహరించడాన్ని స్కూబా డైవింగ్ అంటారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ రాసిన తాప్సీ... అందులో మంచి మార్కులు తెచ్చుకుని స్కూబా డైవింగ్ లైసెన్స్ పొందింది.

    ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్కూబా డైవింగ్ లైనెన్స్ పొందిన విషయాన్ని వెల్లడించారు. మరో ప్రపంచం(సముద్ర ప్రపంచం)లోకి నేను అడుగు పెట్టబోతున్నాను అంటూ తన ఆనందాన్ని వెలు బుచ్చింది. షూటింగుల నిమిత్తం వివిధ దేశాల్లో పర్యటించే తాప్సి ఇక అవకాశం దొరికినప్పుడల్లా స్కూబా డైవింగ్‌ చేయనుందన్నమాట.

    ఆమె ప్రొఫెషన్ వివరాల్లోకి వెళితే... ఈ తరం సినిమాల్లో హీరోయిన్ అంటేనే గ్లామర్‌కు మారు పేరు. గ్లామర్ ఎంత ఎక్కువగా ఉంటే అన్ని సినిమా అవకాశాలు. ఈ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకుంది హీరోయిన్ తాప్సీ. కెరీర్లో పెద్దగా సక్సెస్‌లు లేక పోయినా....... సినిమా అవకాశాలు మాత్రం జోరుగానే రాబట్టుకుంటోంది

    గత కొంత కాలంగా తాప్సీ ఏ సినిమా ఫంక్షన్‌కు హాజరైనా, ఏ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లినా.... చిట్టిపొట్టి స్కర్టులు వేస్తూ అందరి చూపులు తన అందాలపై పడేలా చేసుకుంటోంది. ఇలాంటి డ్రెస్సులు వేసినప్పుడే మీడియా అటెన్షన్ తనపై ఉంటుందని, తన హాట్ ఫోటోల కోసం ఇంటర్నెట్లో వెతికేవారి సంఖ్య పెరుగుతుందని ఆమె భావనగా కనిపిస్తోంది.

    ప్రస్తుతం తాప్సి వెంకటేష్ హీరోగా రూపొందతున్న 'షాడో' చిత్రంతో పాటు, జాక్ పాట్ అనే మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తమిళంలో వాలయ్ అనే చిత్రంలో, తెలుగు-తమిళ భాషల్లో లారెన్స్ హీరోగా రూపొందుతున్న 'ముని 3-గంగ' చిత్రంలో నటిస్తోంది.

    English summary
    "Just short of a written exam before I get my scuba diving license! So wish me luck!!! Last day in maldives n then back to meri dilli. Yayyyyyyy n m a licensed scuba diver!! Part of another world now" Tapsi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X