నాకు, నా కుటుంబానికి వేధింపులే : ప్రియాంక చోప్రా
ముంబై : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనపై వినిపించే వివాదాస్పద వార్తలు, రూమర్లపై తీవ్రంగా స్పందించింది. అలాంటివి తనకు, తన కుటుంబాన్ని తీవ్రమైన వేదనకు గురి చేస్తాయి, అలాంటి వాటిని వేధింపులుగానే భావిస్తానని చెప్పుకొచ్చింది. అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు, రూమర్లపై తాను స్పందించబోనని, స్పందిస్తే దానికి మరిన్ని కథలు అల్లుతారు అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
ఇటీవల ప్రియాంక చోప్రా మరొక నటి కరీనా కపూర్‌తో గొడవ పడినట్లు పుకార్లు వినిపించాయి. ఈ వార్త ప్రియాంక చోప్రాతో పాటు ఆమె కుటుంబానికి మనస్తాపాన్ని కలిగించాయట. గతంలో అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌తో ప్రియాంకాకు ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు రావడం, వాదాలు చోటు చేసుకోవడం కూడా ఆమె ఫ్యామిలీని బాధించాయట.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా 'జీంజీర్' మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'జంజీర్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధం అవుతోంది. 'జంజీర్' చిత్రం గతంలో అమితాబ్ నటించిన సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్లో ప్రియాంకకు ఉన్న పాపులారిటీ, సౌత్‌లో రామ్ చరణ్‌కు ఉన్న పాపులారిటీ వెరసి సినిమా మంచి ఫలితాలను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా.


Click it and Unblock the Notifications












