వర్మ సినిమాలో ఛాన్సే పెద్ద అధ్బుతమైన విషయం..?
రామ్ గోపాల్ వర్మ, సునీల్ కాంబినేషన్ లో రూపొందనున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు (ఆగస్టు 27) ఉదయం పన్నెండు గంటలకు ఓపెన్ అయ్యింది. సునీల్ పై అతిలోక సుందరి శ్రీదేవి క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చిత్రంలోని ఓ పాటను ప్లే చేసి వినిపించారు. ఆ పాటలో తెలుగు సినిమా దర్శకులనందరినీ విమర్శిస్తూ సాగుతుంది. ఈ పాట నేపద్యాన్ని రామ్ గోపాల్ వర్మ వివరించారు.
ఈ సంధర్బంగా సునీల్ మాట్లాడుతూ 'ప్రేమకధ' సినిమా టైమ్ లోనే వర్మతో కలిసి తాను పనిచేయాల్సి వందనీ, ఐతే నాకు అంత సీను లేకపోవడంతో వర్మ సున్నితంగా తిరస్కరించారని, ఆ రోజు అలా తిరస్కరించబట్టే ఈ రోజు ఇలా నన్ను హీరోగా పెట్టి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అనే చిత్రం తీస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన 'మర్యాద రామన్న' సినిమాలో నటించడం అధ్బుతమైతే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఛాన్సు ని కోట్టేయడమే చాలా అధ్బుతం అన్నారు.
నా చిన్నప్పటి నుండి నేను మేచ్చే హీరోయిన్ శ్రీదేవి గారని ఆమెతో నటించాలన్న కోరిక మాత్రం ఇంకా మిగిలి పోయిందని సునీల్ చెప్పారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో చేయ్యాలన్న తన కోరిక నెరవేరినందుకు సునీల్ ఆనందం లో మునిగి తేలుతున్నాడు.


Click it and Unblock the Notifications











