»   » నా జీవితంలో తొలిసారి అది పవన్ కల్యాణ్‌తోనే.. శృతిహాసన్

నా జీవితంలో తొలిసారి అది పవన్ కల్యాణ్‌తోనే.. శృతిహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శృతి హాసన్ తొలి విజయాన్ని అందుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. గాయనిగా, నటిగా రాణించినా సరైన సక్సెస్‌ను దక్కించుకోవడానికి గబ్బర్‌సింగ్ చిత్రం వరకు ఆగాల్సి వచ్చింది.

తొలి బ్లాక్ బస్టర్ పవన్‌ కల్యాణ్‌తోనే

తొలి బ్లాక్ బస్టర్ పవన్‌ కల్యాణ్‌తోనే

తమిళ, హిందీ, తెలుగు పరిశ్రమల్లో తనకు తొలి బ్లాక్ బస్టర్‌తోనే లభించిందని శృతిహాసన్ ఇటీవల మీడియాకు వివరించింది. మరోసారి బ్లాక్ బస్టర్‌ను పవన్ కల్యాణ్‌తోనే అందుకొంటానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో పవర్ స్టార్ సరసన నటిస్తున్నది.

వీరమ్‌కు పోలికే ఉండదు.. అనేక మార్పులు

వీరమ్‌కు పోలికే ఉండదు.. అనేక మార్పులు

కాటమరాయుడు చిత్రం తమిళ చిత్రం వీరమ్‌కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రానికి అసలు పోలికే ఉండదని శృతి హాసన్ తెలిపింది. తెలుగు నేటివిటికి తగినట్టుగా వీరమ్ చిత్రానికి అనేక మార్పులు చేసి కాటమరాయుడు రూపొందిస్తున్నరని చెప్పింది.

అభిమానులతో కలిసి థియేటర్‌లో చూస్తా

అభిమానులతో కలిసి థియేటర్‌లో చూస్తా

కాటమరాయుడు చిత్రం టీజర్, తొలి పాటకు విశేష స్పందన రావడంతో విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అభిమానులు, సినీ ప్రేక్షకులతోపాటు నేను కూడా ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని శృతి హాసన్ తన మనసులోని కోరికను బయటపట్టింది.

తొలిపాటకు రికార్డు హిట్లు

తొలిపాటకు రికార్డు హిట్లు

ఇటీవల విడుదల చేసిన కాటమరాయుడు తొలిపాటకు విశేష స్పందన లభిస్తున్నది. దాదాపు 26.20 లక్షల మంది ఈ పాటను యూట్యూబ్‌లో వీక్షించారు. విడుదలైన మొదటి అర్ధగంటలోనే లక్షమంది చూడటం గమనార్హం.

English summary
Shruti Haasan got first blocbuster movie with Pawan Kalyan. Gabbar Singh movie gives fantastic success. She said that I will get another blockbuster with Pawan Kalyan movie Katamrayudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu