డ్రగ్స్‌కు బానిసయ్యాను...అని ఒప్పుకున్న దర్శకుడు!

ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ...'నా సినిమాలు పనిచేయనపుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను. అయితే ఉప్పులూరి గోపాల కృష్ణమూర్తిని కలిసాక నా జీవితం ఒక్కసారి జీవితమే మారిపోయింది. అప్పుడే జీవితం, సమాజం విలువ తెలుసుకున్నాను. తమ కుమారుడిని పోగొట్టుకున్న ఓ దంపతులను చూసాక జీవిత సారాంశాన్ని తెలుసుకున్నాను' అని వెల్లడించారు.
అయితే దేవుడి మీద నమ్మకం ఎప్పుడో పోయింది. జీవితంలో కనీస అవసరాలు కూడా తీరకపోవడం వల్లనే దేవుడిపై అసంతృప్తి పెరిగి పోయింది. నా తండ్రి ఎక్కువ కాలం బ్రతకాలని, నాతోనే ఉండాలని కోరుకున్నాను. కానీ నేను అనుకున్నది జరుగలేదు. దేవుడి గురించి నా వ్యక్తి గత అభిప్రాయాలను ఎవరిపై రుద్దను, ఎవరి మనో భావాలను దెబ్బతీయను అని మహేష్ భట్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











