ఎన్టీఆర్ మాజీ గర్ల్ ప్రెండ్ బరువు 105 కిలోలు
ఎన్టీఆర్ ప్రేమలో పడ్డ ఆమె గుర్తుండే ఉంటుంది. వరసగా ఎన్టీఆర్ సరసన నరసింహుడు,అశోక్ చేసిన ఆమె అప్పట్లో 105 కిలోలు బరువు ఉండేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది. ఆమె మాటల్లోనే...నాకు 19 ఏళ్ల వయసులో నా బరువు 105 కిలోలు. నా శరీర ఆకృతి విషయానికి వస్తే ఎలాంటి షేపులు లేకుండా రుబ్బురోలులా ఉండేదాన్ని. అప్పట్లో నన్ను అందరూ హేళన చేసేవారు. దాంతో నాకు బయటకు రావాలంటేనే బాధగా ఉండేది. నా చెల్లెలు మేగ్నా చాలా అందంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేవాళ్లు నా దరికి చేరేవాళ్లు కాదు. నా చెల్లెలి నడుము సైజ్ 22 ఇంచ్‌లు కాగా నా నడుము అందుకు రెట్టింపు ఉండేది. దీంతో కాలేజి రోజుల్లో చాలా డిప్రెషన్ కు గురయ్యాను. అప్పుడు ఆహారం తగ్గించి చూసాను. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత బరువుకు, ఆహారానికి సంబంధం లేదని అర్థం కావడంతో యథావిధిగా తినడం మొదలెట్టాను. యోగాసనం, వ్యాయామం ద్వారా శరీర బరువును తగ్గించుకున్నాను. నేను చెప్పేదొకటే కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిదేది ఉండదు అని శెలవిచ్చింది.


Click it and Unblock the Notifications











