మగాళ్ల దృష్టి నాపై లేటుగా పడింది : సమీర
'నా అభిప్రాయం ప్రకారం భారతీయ మహిళలు నిండైన అందాలతో ఉంటేనే ఇక్కడి మగాళ్లు ఇష్ట పడతారు, ఎముకల గూడులా ఉండే వారిని అంతగా ఇష్ట పడరు' అంటోంది హీరోయిన్ సమీరారెడ్డి. ఓ ఆంగ్ల పత్రికలో ఆమె మాట్లాడుతూ....తన బాడీ స్టక్చర్‌పై తాను సంతృప్తిగానే ఉన్నానని, ఇలా ఉండటం అంటనే తనకు ఇష్టమని అంటోంది. చాలా మంది అమ్మాయిలు జీరో సైజు కోసం ప్రయత్నించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని.....మంచి శరీర సౌష్టవంతో ఉంటేనే ఆరోగ్యంతో పాటు అందం ఉంటుందని అంటోంది ఈ భామ. కారణం ఏమిటో తెలియదుకానీ...ఎందుకో తన అందాలపై మగాళ్ల దృష్టి లేటుగా పడిందని మసులోని మాటను ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పింది.
తెలుగులో జై చిరంజీవి, అశోక్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు....ఆ చిత్రాలు సరైన విజయం సాధించక పోవడంతో మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు. గత సంవత్సరం పలు తమిళ చిత్రాలతో దూసుకెల్లిన సమీరా ఈ సంవత్సరం ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో ఖరారైంది. ఆమె నటించిన తమిళ చిత్రం వెట్టై ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె తేజ్ అనే హిందీ చిత్రంలో, వరదనాయక అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











