అవును అతనితో కనెక్షన్ పెట్టుకున్నా.. కానీ?, ప్రభాస్‌కు ఎందుకా పిచ్చి: శ్రీరెడ్డి

Recommended Video

ఆకరికి ప్రభాస్ ని కూడా వదలలేదు...!

తెలుగు సినీ పరిశ్రమపై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అవకాశాల మాటున అమ్మాయిలను అంగడి బొమ్మల్లా మారుస్తున్నారని, ప్రముఖ దర్శక నిర్మాతలు, టాప్ హీరోలు అని చెప్పుకునేవాళ్లకు సైతం ఇందులో హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అవకాశాల కోసం ఓ బడా నిర్మాత కొడుకుతో తాను ప్రేమ వ్యవహారం నడపాల్సి వచ్చిందని మరో సంచలన విషయం చెప్పారు.

ఎవరా నిర్మాత కొడుకు?:

ఎవరా నిర్మాత కొడుకు?:

అవకాశాల కోసం బడా నిర్మాత కొడుకుకు దగ్గరవాల్సి వచ్చిందని.. తద్వారా వాళ్ల ప్రొడక్షన్ లో తెరకెక్కే సినిమాల్లో తనకేమైనా అవకాశాలు ఇప్పిస్తాడేమోనని భావించినట్టు శ్రీరెడ్డి చెప్పారు. కనెక్షన్ పెట్టుకున్నా సరే.. తనకు మాత్రం అవకాశాలేవి రాలేదని వాపోయారు. అయితే సదరు నిర్మాత కొడుకు ఎవరన్నది మాత్రం ఆమె బయటపెట్టలేదు. అయితే బడా నిర్మాత అంటూ క్లూ ఇవ్వడంతో.. ఇండస్ట్రీలో కొంతమంది పేర్ల చుట్టూ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

బడా హీరోయిన్లనూ పంపిస్తారు..:

బడా హీరోయిన్లనూ పంపిస్తారు..:

ఇండస్ట్రీలో జరుగుతున్న రాసలీలకు బడా హీరోయిన్లు, బడా హీరోలు కూడా మినహాయింపేమి కాదన్నారు శ్రీరెడ్డి. కొంతమంది పెద్ద హీరోలు తమ అవసరాల కోసం రాజకీయ నాయకుల వద్దకు టాప్ హీరోయిన్లను పంపిస్తుంటారని బాంబు పేల్చారు. అగ్ర దర్శకులు, నిర్మాతలు అని చెప్పుకునే కొంతమంది ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

వాడెలా ఉన్నా వాడితో గడపాల్సిందే..:

వాడెలా ఉన్నా వాడితో గడపాల్సిందే..:

ఇటీవల తన ఫ్రెండ్ ఒక అమ్మాయి తన కష్టాల గురించి చెప్పుకుని బాధపడిందని శ్రీరెడ్డి గుర్తుచేసుకున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. వాడు లావుగున్నా.. వాడి నోరు కంపు కొడుతున్నా సరే.. వాడితో పడకేయాల్సి వస్తుందని, అయినా సరే అవకాశాలు మాత్రం రావట్లేదని ఆమె వాపోయినట్టు చెప్పుకొచ్చారు.

ప్రభాస్.. ఎందుకా పిచ్చి?:

ప్రభాస్.. ఎందుకా పిచ్చి?:

ప్రభాస్‌పై కూడా కొన్ని విమర్శలు చేశారు శ్రీరెడ్డి. ప్రభాస్ హైట్ పిచ్చోడు అని కామెంట్ చేశారు. హైట్ ఉన్నవాళ్లనే తన పక్కన హీరోయిన్లుగా పెట్టుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. ఏం నిత్యా మీనన్ హైట్ తక్కువగా ఉన్నా.. ఎంత బాగా యాక్ట్ చేయట్లేదు, సమంత చేయట్లేదా? అని ప్రశ్నించారు.

 కొండ మీద కోతులే కావాలా?:

కొండ మీద కోతులే కావాలా?:

ఇండస్ట్రీలో బడా బాబులైన హీరోలకు, దర్శకులకు ఇక్కడి అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టుకోవడం ఇష్టం ఉండదని, ఎంతసేపూ కొండ మీద కోతులే కావాలా?.. అని నిలదీశారు. ఇలాంటి వాటికి మా అసోసియేషన్ బాధ్యత వహించదా? అని ప్రశ్నించారు. నాలాంటి వాళ్లు ఇంతగా బాధపడుతున్నా.. మా అసోసియేషన్ మాత్రం ముందుకు రాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీ ఏమంటోంది?:

ఇండస్ట్రీ ఏమంటోంది?:

ప్రముఖ హీరోలు, దర్శకులు కోఆర్డినేటర్స్.. కింద అనేక మంది మహిళలు నలిగిపోతున్నారని తమ స్టింగ్ ఆపరేషన్ లో తేలినట్టు శ్రీరెడ్డితో డిబేట్ నిర్వహించిన సదరు చానెల్ కూడా తెలిపింది. అయితే.. ఏ ఇండస్ట్రీలో ఇలాంటి వైఖరి లేదు?.. సాఫ్ట్‌వేర్‌లో లేదా? మీడియాలో లేదా? అంటూ ఇండస్ట్రీ వారే ఎదురు ప్రశ్నిస్తున్నారని సదరు యాంకర్ పేర్కొన్నారు.

 కుల గజ్జి కూడా?

కుల గజ్జి కూడా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కులగజ్జి కూడా ఉందని ఆరోపించారు శ్రీరెడ్డి. టాలెంట్ కంటే కులగజ్జినే ఎక్కువ ఇష్టపడుతారని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఎవరో పెద్ద హీరోయిన్ వస్తున్నారని చెప్పి.. కూర్చున్న కుర్చీలో నుంచి లేపి సైతం తనను లేపిన సందర్భాలున్నాయని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. వాళ్లకో రకమైన ఫుడ్ పెడుతారని, తమకో రకమైన ఫుడ్ పెడుతారని, కనీసం మినరల్ వాటర్ కూడా ఇవ్వరని అన్నారు. ఇలా ఇండస్ట్రీలో అడుగడుగునా.. తెలుగు అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X