మహేష్ కటౌట్ చూసి షాక్ అయ్యా.. రోమాలు నిక్కబొడుచుకునేలా, కైరా రియాక్షన్!
Recommended Video

భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. భరత్ అనే నేను చిత్రంలో తన నటనతో మహేష్ వన్ మాన్ షో చేసాడు. మహేష్ నటన, స్టైల్, యంగ్ సీఎంగా లుక్స్ అభిమానులకు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. సమాజంలో ఉన్నా కొన్ని ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టిన కొరటాల వాటికీ తనదైన శైలిలో పరిష్కారం చూపారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కొరటాల శివ కథ, మహేష్ నటన, హీరోయిన్ కైరా అద్వానీ గ్లామర్ తో ఆ అంచనాలని అందుకునే విధంగా ఉంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మహేష్ కు హిట్ సినిమా పడితే ఎలా ఉంటుందో భరత్ అనే నేను చిత్రం మరోమారో నిరూపించింది. తాజగా ఈ చిత్ర హీరోయిన్ కైరా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్రం గురించి, మహేష్ గురించి అనేక విషయాలు వెల్లడించింది.

ఓ స్టార్ హీరోతో నటించా
భరత్ అనే నేను చిత్రం చేస్తున్నప్పుడు తాను ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాని తెలుసు అని కైరా అద్వానీ తెలిపింది. కానీ మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో సినిమా విడుదలయ్యాకే తెలిసిందని కైరా తెలిపింది. మహేష్ కోసం అభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్స్ చూసి షాక్ అయ్యానని కైరా అద్వానీ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

ఒదిగి ఉండే మనిషి
మహేష్ బాబు పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్స్ లో అందరితో చాలా బాగా మాట్లాడేవారని కైరా అద్వానీ తెలిపింది. వసుమతి పాత్ర తాను నిజజీవితంలో దగ్గరగా ఉండే పాత్ర అని తెలిపింది. కానీ వసుమతి కంటే తాను కొంచెం అల్లరి పిల్లనని తెలిపింది.

తొలి చిత్రంతోనే
టాలీవుడ్ లో తాను నటించిన తొలి చిత్రమే పెద్దస్టార్ హీరోది కావడం, భారీ విజయం దిశగా ఈ చిత్రం వెళుతుండడం తన అదృష్టమని కైరా అద్వానీ తెలిపింది. సౌత్ లో తొలి చిత్రంతోనే అద్భుతమైన దర్శకుడు కొరటాల సినిమాలో నటించే అవకావం వచ్చిందని కైరా తెలిపింది.

రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం
ఈ చిత్రంలో అంతా మహేష్ బాబు ప్రెస్ మీట్ సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నారని కైరా అద్వానీ తెలిపింది. తనకు కూడా ఆ సన్నివేశం చాలా ఇష్టం అని కైరా తెలిపింది. తొలిసారి ఆ సన్నివేశం చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నఫీలింగ్ కలిగిందని కైరా తెలిపింది. ట్రైన్ లో తనకు, మహేష్ మధ్య సాగే సన్నివేశం కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని కైరా తెలిపింది.

నిజంగా సీఎం అయినా కూడా
వసుమతి తలిసారి సీఎం భరత్ అని కలిసే సన్నివేశం కూడా తనకు చాలా ఇష్టం అని తెలిపింది. తాను నిజంగా ముఖ్యమంత్రిని కలిసినా అలాగే ఫీల్ అవుతానని తెలిపింది.


Click it and Unblock the Notifications











