»   » ఆ డైరక్టర్ సెట్ లో మోకాళ్లపై కూర్చోబెట్టి చావబాదాడు

ఆ డైరక్టర్ సెట్ లో మోకాళ్లపై కూర్చోబెట్టి చావబాదాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ఓ డైరక్టర్ నన్ను చితక్కొట్టాడు అని ఏ హీరో అయినా చెప్పుకోగలడా . కానీ చిన్న వయస్సులోనే దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్న రణబీర్ కపూర్ చెప్పారు. 'యే దిల్‌ హై ముష్కిల్‌' విజయం సాధించిన నేపథ్యంలో సంతోషంతో ఉన్నాడు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ ఓ చాట్‌ షోలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించాడు.

రణ్‌బీర్‌ మాట్లాడుతూ...తను సినిమాల్లోకి రాకముందు దర్శకుడు కావాలనుకున్నానని... ఇందుకోసం క్రియేటివ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన బ్లాక్‌ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో భన్సాలీ టాస్క్‌ మాస్టర్‌గా వ్యవహరించేవారట. ఒకసారి వర్క్‌ విషయంలో రణ్‌బీర్‌ని మోకాళ్లపై కూర్చోబెట్టి చితకబాదారట.

ప్రేమంటే మోహం, స్నేహమంటే సుఖం....( 'యే దిల్ హై ముష్కిల్' రివ్యూ)

దాంతో ఆ టార్చర్‌ భరించలేక సెట్‌ నుంచి వెళ్లిపోవాలనుకున్నానని రణ్‌బీర్‌ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. కానీ ఎంత టార్చర్‌ చేసినా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది మాత్రం భన్సాలీనేనని ఆయన వల్లే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానని ఓ టీచర్‌గా అన్నీ ఆయనే దగ్గరుండి నేర్పించారని చెప్పుకొచ్చాడు రణ్‌బీర్‌.

I had to kneel down on sets and he used to beat me: Ranbir on Sanjay Bhansali

విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.గత శుక్రవారం విడదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లక్లబ్‌లో చేరిపోయింది.

భారత్‌లో ఈ చిత్రం రూ.76 కోట్లకు పైగా వసూలు చేయగా ఓవర్‌సీస్‌లో 6.55 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.121.21 కోట్ల బిజినెస్‌ చేసి 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ వెల్లడించింది.

ఉరీ ఘటన నేపథ్యంలో పాక్‌ నటులు భారత్‌ వదిలి వెళ్లిపోవాలని, వారి సినిమాలను భారత్‌లో విడుదల చేయనివ్వమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల విషయమై దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌.. నిర్మాతల బృందం హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసిచర్చించారు.

సినిమా విడుదలకు పూర్తి సహకారం అందిస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చాక.. నిర్మాతల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌, ఎం.ఎన్‌.ఎస్‌ నేతలతో చర్చించింది. సినిమా విడుదలకు ఒప్పుకోవాలంటే.. చిత్రబృందం రూ.5 కోట్లు జవాన్ల కుటుంబాలకు ఇవ్వాలని ఎం.ఎన్‌.ఎస్‌ డిమాండ్‌ చేసింది.

ఈ విషయం రాజకీయ ప్రముఖుల నుంచి బాలీవుడ్‌ వరకు దుమారం రేపింది. విడుదలకు ముందే ఈ చిత్రం వివాదాస్పదంగా మారినా.. విడుదలయ్యాక బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడం విశేషం.

English summary
Ranbir Kapoor recollects his time under ‘hard task master’ Sanjay Leela Bhansali(SLB) and why he quit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu