twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండూ అసహ్యం.. 'జీఎస్‌టీ-2'అక్కడ షూట్ చేస్తా..:రాంగోపాల్ వర్మ

    |

    Recommended Video

    If Rajinikanth Became PM India Became America

    సాదాసీదా థియరీతో వర్మతో వాదించడం చాలా కష్టం. దేని గురించి ప్రశ్నించినా సరే.. 'ఇక్కడ టూ పాయింట్స్ అండి..' అంటూ మొదలుపెట్టేస్తాడు. తనదైన థియరీతో ఎదుటోళ్లను గింగిరాలు తిప్పించేయగల ఘనుడు. తప్పొప్పుల బేరీజు పక్కనపెడితే.. వ్యక్తివాదంలో వర్మను మించినవాళ్లు లేరనడంలో అతిశయోక్తి లేదేమో!. అలాంటి వర్మకు జీవితంలో రెండు విషయాలంటే పరమ అసహ్యమట..

    అవంటే అసహ్యం:

    'నాకు పెళ్లిళ్లు, అంత్యక్రియలు అంటే అసహ్యం. ఒకటేమో స్వేచ్చను చంపేస్తుంది.. మరొకటి శరీరాన్ని చంపేస్తుంది..' అని రాంగోపాల్ వర్మ తాజాగా తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

    రజనీ పీఎం అయితే..:

    'సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియాకు ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రమే ఇండియా అమెరికాగా మారుతుంది. 2.0 నుంచి 200.జీరో స్థాయికి ఎదుగుతుంది.' అంటూ మరో ట్వీట్ కూడా చేశారు వర్మ.

    వీటిపై పడ్డారన్నమాట..:

    ఇన్నాళ్లు 'జీఎస్‌టీ'తో ట్వీట్ల మోత మోగించిన వర్మ.. 'జీఎస్‌టీ-2' మొదలుపెట్టేవరకు ఇప్పుడిలా పెళ్లిళ్లు, అంత్యక్రియలు.. రజనీపై పడ్డారన్నమాట. తనకు నచ్చిన అంశంపై నచ్చినట్లుగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వర్మ కామెంట్స్ ను ఎప్పటిలాగే ఆయన ఫ్యాన్స్ భలే ఎంజాయ్ చేస్తున్నారు.

    'జీఎస్‌టీ-2' షూటింగ్ అక్కడ..:

    ఇక మరో ట్వీట్ లో 'జీఎస్‌టీ-2' గురించి ప్రస్తావిస్తూ.. ' జీఎస్‌టీ-1కి విరుద్దంగా జీఎస్‌టీ-2ని తెరకెక్కించబోతున్నాను. జీఎస్‌టీ-1 పూర్తిగా ఇండోర్ లో తీసింది. కానీ జీఎస్‌టీ-2 ఓ అందమైన ద్వీపంలో షూట్ చేయబోతున్నాం' అని స్పష్టం చేశారు.

    'జీఎస్‌టీ-2' ఎలా ఉండబోతుందో:

    'జీఎస్‌టీ-2' ఎలా ఉండబోతుందో:

    జీఎస్‌టీ-1 విషయంలో ఎంతమంది ఎన్ని విధాలుగా వాదించినా వర్మను అడ్డుకోలేకపోయారు. ఎప్పటిలాగే సమాజం, సంస్కారం వంటి విషయాలు తన తలకు ఎక్కవని వర్మ కూడా మరోసారి నిరూపించాడు. జీఎస్‌టీ-1 తోనే జనాలను గగ్గోలు పెట్టేలా చేసిన వర్మ.. ఇక జీఎస్‌టీ-2తో ఇంకెలాంటి సినిమా చూపించబోతున్నాడో అన్న చర్చ మొదలైంది. చూడాలి మరి.. వర్మ జీఎస్‌టీ-2 బొమ్మ ఇంకెంత బోల్డుగా ఉండబోతుందో!

    English summary
    Rgv made a tweet in twitter regarding marriages and deaths. He said 'I hate both weddings and funerals for the reason that one is the death of freedom and the other is the death of the body'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X