»   » హల్ చల్ చేస్తున్న "ఐ హేట్ హీరోస్" వీడియో: చిరంజీవీ, బాలయ్యా పోస్టర్లు కాల్చేసారు (వీడియో)

హల్ చల్ చేస్తున్న "ఐ హేట్ హీరోస్" వీడియో: చిరంజీవీ, బాలయ్యా పోస్టర్లు కాల్చేసారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవీ,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ టాలీవుడ్ అగ్ర హీరోలు అన్న మాట కాదని ఎవరూ అనలేదు వందల సినిమాల పైబడి మరీ సినిమాలతో ఇన్నేళ్ళుగా అగ్ర స్థానం లో ఉన్న ఈ హీరోలకి యాక్టింగేరాదట కేవలం చిరంజీవి తప్ప మిగిలిన ముగ్గురూ వారసులుగా వచ్చి అదృష్టం తో హీరోలయ్యారట.... అలా అని చిరంజీవినీ వదల్లేదు ప్రజారాజ్యం పెట్టి ప్రజలని మోసం చేసాడు అంటూ తిట్టి మరీ మరీ ఆయన పోస్టర్ ని చించి కాల్చేసారు. ఇవన్నీ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నారా...?

తెలుగు హీరోలందరినీ దుయ్యబడుతూ వారి ఫొటోలని కాలుస్తూ చేసిన ఒక సాంగ్ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోల వారసుల హవా నడుస్తుంది. ఇప్పటికే అగ్ర హీరోల తనయులు హీరోలుగా చెలామణి అవుతూ ఉండగానే వారి తనయులు హీరోలుగ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక్క హీరోల తనయులే కాకుండా దర్శక,నిర్మాతల వారసులు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు.

ఇక వారసులు కాకుండా ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వస్తున్న హీరోలు కూడా వారి స్టామినా ఏంటో నిరూపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో హీరోలను వారసులను పిచ్చి తిట్టుడు తిడుతూ ఓ సాంగ్ క్రియేట్ చేశారు. "ఐ హేట్ హీరోస్" పేరుతో ఇద్దరు యువకులు వీడియో రూపొందించి యు ట్యూబ్ లో పెట్టారు.ఇప్పుడు ఆ సాంగ్ వైరల్ గా మారి హల్ చల్ సృష్టిస్తుంది.

చిరంజీవి ప్రజారాజ్యంతో ప్రజలను మోసం చేలేదా..?, బాలయ్యకు వాళ్లయ్య ఉన్నాడు అందుకే నటసింహం అయ్యాడు, నాగార్జున ఏఎన్నాఆర్ బ్యాంక్ గ్రౌండ్ తో కింగ్ అయిపోయాడు, నాయుడి గారి వల్ల వెంకటేష్ విక్టరీ అయ్యాడు, పూర్తిగా యాక్టింగ్ రాని పవన్.. పవర్ స్టార్ అయ్యాడు, సరిగా మాట్లాడలేని మహేష్ ప్రిన్‌ అయ్యాడు, పెదనాన్న సపోర్ట్ తో ప్రభాస్ రెబెల్ స్టార్ అయ్యాడు

సర్జరీలు చేసుకుని అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అయ్యాడు, హైట్ లేకున్నా బ్యాంక్ గ్రౌండ్ వెయిట్ తో ఎన్టీఆర్ యంగ్ టైగర్ అయ్యాడు., టాలెంట్ లేకున్నా, యాక్టింగ్ రాకున్నా మన సంపూ అన్న హీరో అయ్యాడు.. ఇలా ఉంది వీళ్ల పాట. ఒక్కొక్క హీరో పేరు వచ్చినప్పుదల్లా ఆ హీరో పోస్టర్ని తగలబెట్టారు.

అయితే ఎవరికీ యాక్టింగ్ రాదంటూ తిట్టిన వీళ్ల యాక్టింగ్ మాత్రం ఏమైనా బావుందా అంటే అదేం లేదు. వీళ్ళూ ఏదో భాషనుంచి వచ్చి చేసిన పరభాషా నటుల్ల మొహాల్లో ఏ ఎక్స్ప్రెషనూ లేకుందా ఉనారు. ఇక ఏడుస్తూ గిటార్ వయించిన నటుని యాక్టింగ్ అయితే చూదను కూదా లేం... ఇదే విశయాన్ని ఎత్తి చూపుతూ విమర్షించిన వాళ్ళు కొందరైతే. తమ హీరోలని అవమానించినందుకు "నిజం బూతులతో" తిట్టిన వాళ్ళుకొందరు. అయితే వీళ్ళ ప్రయత్నాన్ని మెచ్చుకున్న వాళ్ళు కూదా ఉండటం గమనార్హం....

English summary
Two Men uploaded a controversial video on our Tollywood Heroes by saying that they don't know acting and they were in Telugu Film industry..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu