Don't Miss!
- News సివిల్స్ విజేతను చేసిన అవమానం-ఆంధ్రా కానిస్టేబుల్ విజయ గాథ..!
- Finance Paytm News: పేటీఎంకు మరో దెబ్బ..! దానిని నిషేధించిన ప్రభుత్వం.. ఎందుకంటే..??
- Sports KKR vs RR మ్యాచ్ టర్నింగ్ పాయింట్: రియాన్ పరాగ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్.. !వీడియో
- Technology WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- Automobiles తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్‌లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
ఐ హేట్ మోహన్‌బాబు: వర్మ ( 'రౌడీ' ఆడియో రిలీజ్ ఫోటోలు)
హైదరాబాద్: 'నేను మోహన్‌బాబుని ద్వేషిస్తాను' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన రామ్‌గోపాల్ వర్మ దానికో కారణం చెప్పారు. 'నా చిన్నతనంలో ఓసారి జయసుధ పోస్టర్ చూసి ఆమెతో ప్రేమలో పడిపోయాను. అలా నాకెంతో నచ్చిన జయసుధని 'శివరంజని' సినిమాలో మోహన్‌బాబు నానా కష్టాలు పెట్టడమే నా ద్వేషానికి కారణం' అంటూ వివరించి నవ్వించారు.
'రౌడీ' చిత్రం పాటల విడుదల కార్యక్రమం గురువారం రాత్రి తిరుపతిలో జరిగింది. మోహన్‌బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. ఆర్. విజయ్‌కుమార్, పి.గజేంద్రకుమార్, ఎం.పార్ధసారథినాయుడు సంయుక్తంగా నిర్మించారు. మంచు విష్ణు సమర్పకులు. సాయికార్తీక్ సంగీతమందించారు.
''స్టార్ డమ్, డ్యూయెట్స్‌తో తెలుగు పరిశ్రమ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిపోతోంది. కథా బలాన్ని, నటుల ప్రతిభని చూపించే సినిమా రావాలని నేను అనుకుంటున్నప్పుడు వర్మ ఈ కథతో వచ్చాడు'' అన్నారు దాసరి నారాయణరావు.
స్లైడ్ షోలో..ఆడియో వేడుక ఫోటోలు...
ఆవిష్కర్త...
తొలి సీడీని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.
దాసరి మాట్లాడుతూ....
''ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబు అంత చక్కటి నటుడు తెలుగు పరిశ్రమలో లేడు. తెలుగు సినిమా చరిత్రను మార్చే సినిమా ఇది. ఇందులో రెగ్యులర్ మోహన్‌బాబు కనిపించడు. మోహన్‌బాబుని మేకప్... విగ్గు లేకుండా చూపించాలనుకోవడమే ఈ సినిమా తొలి విజయం. తెలుగులో వర్మ తన స్థాయి ఏంటో మరోసారి ఈ చిత్రంతో నిరూపిస్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత మోహన్‌బాబు బాగా నటించాడా.. లేక విష్ణు బాగా చేశాడా అని అందరూ అనుకుంటారు. అంతగా పోటాపోటీగా చేశారు. వచ్చే నెల 4న ఈ చిత్రం వస్తోంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
మోహన్‌బాబు మాట్లాడుతూ...
''నేను 555 సినిమాల్లో నటించాను. 58 చిత్రాలు నిర్మించాను. చాలా మంచి పాత్రలు పోషించాను. నాకు ఇప్పటివరకు చాలా మంది దర్శకులు చాలా మంచి పాత్రలు ఇచ్చారు. ఎవర్నీ తక్కువగా చెప్పకూడదు. ఈ సినిమా చేసిన తర్వాత వర్మ శైలికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. '' అన్నారు.
మోహన్ బాబు కంటిన్యూ చేస్తూ...
మోహన్‌బాబు, వర్మ కలయికలో సినిమా వస్తుంది అంటే వీరిద్దరిలో ఎవరు ఎవర్ని కొడతారా అని కొందరు ఎదురుచూశారు. కానీ భగవంతుని ఆశీస్సులతో కలిశాం.. సినిమా చేశాం. దాసరి, రాఘవేంద్రరావు తర్వాత నిజమైన దర్శకుడు రామ్గోపాల్వర్మనే. ఈ చిత్రంలో వైవిధ్యమైన మోహన్‌బాబుని చూస్తారు
వర్మ మాట్లాడుతూ....
''శివరంజని' సినిమాని ఏడు సార్లు చూశాను. అలా దాసరి గారు సృష్టించే పాత్రల్ని పరిశీలించడం వల్ల నేను సహజంగా పాత్రలు సృష్టిస్తున్నాను. విగ్ లేకుండా నటించమని మోహన్‌బాబుని అడిగాను. ఆయన నా మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. నేను నా కెరీర్లో సృష్టించిన ఉత్తమ నాయికానాయక పాత్రలు ఈ సినిమాలో జయసుధ, మెహన్బాబులే. ఇంతవరకు పరిశ్రమలో నాకు ఎవరూ స్నేహితులు లేరు. మోహన్‌బాబే నా తొలి నేస్తం'' అన్నారు.
విష్ణు మాట్లాడుతూ...
''తొలుత కామెడీ సినిమా చేద్దామని వర్మగారు అడిగారు. కానీ నాన్న విష్ణుని యాక్షన్ హీరోగా చూడాలని ఉందనడంతో వర్మగారు రెండ్రోజుల తర్వాత ఈ సినిమా కథ చెప్పారు. మా నాన్న ఈ సినిమాలో కనిపించినంత బాగా ఇంకే సినిమాలోనూ కనిపించలేదు. ఈ సినిమా చేస్తున్నంతసేపు నాన్నతో తెరను పంచుకున్నంతసేపు ఆయనతో పోటీగా నటించాలి అనుకున్నా. ఈ సినిమా నా జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పుతుంది'' అన్నారు.
జయసుధ మాట్లాడుతూ....
''నేను సాధారణంగా పోషించే తల్లి పాత్రల్లో ఇది వైవిధ్యమైనది. ఇందులో 20 ఏళ్ల తర్వాత డ్యాన్స్ చేశాను. వర్మతో చాలా కాలం తర్వాత ఈ సినిమా చేస్తున్నాను'' అన్నారు. శాన్వి మాట్లాడుతూ ''ఈ సినిమా నాకో మైలురాయి. నా కల ఈ సినిమాతో నెరవేరింది. నన్ను ఇంతందంగా చూపించిన వర్మగారికి కృతజ్ఞతలు'' అన్నారు.
ఎవరెవరు...
కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వరప్రసాద్, లక్ష్మీప్రసాద్, పి.వి.రెడ్డి, రామకృష్ణ ప్రసాద్, రమేష్, గోపాలరావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిలీజ్..
ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దాన్ని ఏప్రియల్ 4 తేదీకి మార్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంచు విష్ణు ఖరారు చేసారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో..
ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది.
గాడ్ ఫాదర్ నే...?
సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
కాన్సెప్టు...
ఖద్దరు కట్టిన ప్రతి ఒక్కడూ మహాత్ముడు కాడు. అలానే.. ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడూ రౌడీ కాదు. హింసకు కొన్నిసార్లు హింసతోనే సమాధానం చెప్పవలసి వచ్చిప్పుడు, మంచితనం చేతకానితనంగా మిగిలిపోతున్నప్పుడు ఆయుధం పట్టాల్సిందే. మరి.. 'రౌడీ'లో ఎవరు, ఎందుకు ఆయుధం పట్టారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే