ఆ పని చేసే మగాళ్ళకు నేను దూరం...హన్సిక
'పొగ త్రాగటం అంటే నాకు భలే చిరాకు..అసలు పొగతాగే మగాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటాను' అంచోంది హన్సిక. అలాగే "పొగ త్రాగితే ఆ కిక్ ఆ క్షణం వరకే. ఆ తర్వాత ఆ పొగే మన జీవితాన్ని ఆర్పేస్తుంది. ఎడ్యుకేట్స్ అనుకునే వాళ్లు కూడా ఈ అలవాటుకు బానిసలుగా మారడం చూస్తుంటే బాధేస్తోంది. యువకపలు ఇదేదో ఫ్యాషన్ అనుకొంటారు. ఇదో పెద్ద బ్యాడ్ హ్యాబిట్. మనిషిని ఇది తొందరగా దెబ్బ తీస్తుంది" అంటూ ధూమపానం..దాని నష్టాలు అనే టాపిక్ పై మాట్లాడింది.ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ సరసన కందిరీగ అనే చిత్రంలో చేస్తోంది. దేశముదురు చిత్రంతో తెలుగు నాట స్టార్ గా ఎదిగిన ఈ అందాల భామ మాప్పిళ్లై చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ధనుష్ కు జంటగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జయం రవికి జంటగా ఎంగెందుమ్ కాదల్, విజయ్ సరసన వేలాయుధం, ఎంగెందు మ్ కాదల్ చిత్రాల్లో నటించే అవకాశాలను పొందింది.


Click it and Unblock the Notifications











