అది నా పర్సనల్, నేను ‘తానా’ కోసం రాలేదు, డిసప్పాయింట్ అవ్వొద్దు: రాజమౌళి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహా సభలు జులై 4 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ.వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరుగబోతున్నాయి. ఈ సభలకు పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రమఖులు హాజరైన సందడి చేయబోతున్నారు.

కీరవాణి, సునీత, తమన్‌ మ్యూజిక్ షోలు అందరినీ అలరించబోతున్నాయంటూ నిర్వాహకులు ప్రచారం చేశారు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కూడా వాషింగ్టన్ రావడంతో ఆయన కూడా 'తానా' సభల్లో సందడి చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే తాను ఈ సభలకు హాజరు కావడం లేదని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.

వాషింగ్టన్ వరకు వచ్చి ‘తానా'కు దూరంగా రాజమౌళి

వాషింగ్టన్ వరకు వచ్చి ‘తానా'కు దూరంగా రాజమౌళి

రాజమౌళి వాషింగ్టన్ డిసి చేరుకోవడంతో... ఆయన ఈ సభలకు హారవుతున్నారనే ప్రచారం మరింత బలంగా జరిగింది. దీంతో చాలా మంది తెలుగు అభిమానులు తమ ఆఫీసులకు సెలవు పెట్టిమరీ రాజమౌళిని కలిసి ఆయనతో మాట్లాడేందుకు తానా సభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ రాజమౌళి తాను రావడం లేదని ప్రకటించారు.

పర్సనల్ పని మీద వచ్చిన రాజమౌళి

పర్సనల్ పని మీద వచ్చిన రాజమౌళి

రాజమౌళి ఏదో వ్యక్తిగత పని మీద వాషింగ్టన్ డిసి వచ్చారట. అయితే తానా సభలకు హాజరయ్యారే సమయం లేక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వచ్చింది ఏ పని మీద అనే విషయం బయటకు వెల్లడి కాలేదు. తన సినిమా ‘RRR'కు సంబంధించిన పనిపై వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

అభిమానులకు సందేశం పంపిన జక్కన్న

అభిమానులకు సందేశం పంపిన జక్కన్న

తాను వస్తాననే ఆశతో ‘తానా' సభలకు వచ్చే అభిమానులు నిరాశ పడకుండా.... రాజమౌళి ముందస్తుగా ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. నేను వాషింగ్టన్ వచ్చింది నా పర్సనల్ వర్క్ మీద, తానా కోసం కాదు. నేను పెద్దన్న(కీరవాణి) మ్యూజిక్ షోకు కూడా హాజరు కాకపోవచ్చు. ఎవరూ నిరాశ పడకూడదనే ముందుగా ఈ విషయం చెబుతున్నట్లు తెలిపారు.

రాజమౌళి బిజీ బిజీ

రాజమౌళి బిజీ బిజీ

రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా RRR చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య రూ. 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ సంబంధించిన పని మీదనే రాజమౌళి వాషింగ్టన్ వచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X