అప్పుడు మహేష్, ప్రభాస్, నాని.... ఇప్పుడు సునీల్!

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమాల్లో సరికొత్త సంస్కృతి ప్రారంభైంది. ఒక హీరో సినిమాకు మరో హీరో..... వాయిస్ ఇవ్వడం ఇటీవల పలు సినిల విషయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవల సునీల్ 'మర్యాద రామన్న' కి రవితేజ, విష్ణు హీరోగా రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదే విధంగా వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలలో రానున్న 'డి ఫర్ దోపిడీ' చిత్రానికి డబ్బింగ్ చెప్పారు.

తాజాగా హీరో సునీల్ 'జబర్‌దస్త్' సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణ ఏర్పడటం ఎంతో మంచి పరిణామం. ఈ సినిమాకు తాను వాయిస్ ఓవర్ ఇవ్వడంపై జబర్ దస్త్ ఆడియో వేడుకలో సునీల్ మాట్లాడుతూ ఈ సినిమాకు నేను ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చాను. నేను మిస్టర్ పెళ్లి కొడుకు అనే క్లాస్ ఫిల్మ్ చేస్తున్నాను. సిద్ధార్థ హీరోగా రూపొందుతున్న 'జబర్ దస్త్' పూర్తిగా మాస్ ఫిల్మ్. ఇవి పూర్తిగా భిన్నమైన సినిమాలు. బాక్సాఫీసు వద్ద ఈ రెండు చిత్రాలు సక్సెస్ అవుతాయనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

కాగా... సునీల్ హీరోగా రూపొందుతున్న 'మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు(ఫిబ్రవరి 2) శిల్పకళా వేదికలో జరుగనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆవిష్కరించనున్నారు. దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో ఇషా చావ్లా హీరోయిన్. హిందీ మూవీ 'తను వెడ్స్ మను' రీమేక్ గా ఈ చిత్రం రూపొందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X