తనపై వస్తున్నవన్నీవట్టి పుకార్లే...ప్రియమణి
అందాల సుందరి ప్రియమణి కెరీర్ లో 2010 చాలా ముఖ్యమైనదని చెప్పాలి. గత ఏడాది ఏకంగా తొమ్మిది చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇదే ఏడాది మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'రావణ్" చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమైంది. అయినా ప్రియమణికి ఈ చిత్రం విడుదలైన మూడు భాషల్లోనూ విజయం అందించలేక పోయింది. ఇక ఈ ఏడాది ఆమె నటించిన ఒకే ఒక చిత్రం 'రాజ్". ఈ చిత్రం తర్వాత ఆమె నటించిన చిత్రమేదీ ఇంతవరకు విడుదల కాలేదు. ప్రస్తుతం తెలుగులో' క్షేత్రం" చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత తెలుగులో ప్రియమణికి అవకాశాలు లేవని పుకార్లు వినిపిన్నాయి. తనపై వస్తున్న పుకార్ల గురించి ప్రియమణి స్పందిస్తూ' నాకు అవకాశాలు లేవని వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదు. తెలుగులో ప్రస్తుతం 'క్షేత్రం"లో నటిస్తున్నాను. ఈ చిత్రంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లు చర్చల దశలో వున్నాయి.
అవి త్వరలో ఓకే అవుతాయి. ప్రస్తుతం తెలుగులో 'క్షేత్రం" చిత్రంతో పాటు మలయాళంలో మమ్ముట్టితో ఓ చిత్రం అలాగే కన్నడలో విష్ణువర్థన, కో కో అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాను. అంతే కాకుండా కొన్ని బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. కాకపోతే మంచి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయాలని వస్తున్న ప్రతి ఆఫర్ ని అంగీకరించడం లేదు. అలాగే బాలీవుడ్ కి ప్రయార్టీ ఇవ్వను. అన్ని సినిమాలతో పాటు బాలీవుడ్ ఆఫర్స్ ని కూడా సద్వినియోగం చేసుకుంటాను. నేను ఖాళీగా వున్నానని, ప్రస్తుతం నా చేతిలో క్షేత్రం తప్పా మరే సినిమా లేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజంలేదని చెబుతోంది ప్రియమణి.


Click it and Unblock the Notifications











