సమంత ప్రేమలో పడ్డాను...: రాణా సంచలన ప్రకటన

By Bojja Kumar

హైదరాబాద్: దగ్గుబాటి హీరో రాణా 'జబర్‌దస్త్' ఆడియో వేడుకలో సంచలన ప్రకటన చేసారు. సమంత ప్రేమలో పడ్డట్లు చెప్పుకొచ్చారు. శుక్రవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాణా మాట్లాడుతూ 'నా జీవితంలో ఇప్పటి వరకు ఇద్దరే ఇద్దరని చూసిన తర్వాత నా మనసులో ప్రేమ ఆలోచన పుట్టింది. తొలిసారి నేను ప్రేమించింది ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రీదేవిని. క్షణ క్షణ చిత్రంలో ఆమెను చూసి ప్లాటైపోయాను. ఆ తర్వాత నా మనసు దోచించింది సమంతనే. 'ఏమాయ చేసావె' సినిమాలో ఆమె ఎంతో ఫ్యాబులెస్ గా కనిపించింది' అంటూ రాణా వ్యాఖ్యానించారు.

హీరో సిద్ధార్థ గురించి మాట్లాడుతూ... సిద్ధార్థను చాలా కాలంగా చూస్తున్నాను. ఆయన అప్పటికీ ఇప్పటికీ యువకుడిగానే కనిపిస్తారు. ఆయనతో పాటు కెరీర్ సాగించిన వాళ్లంతా ఆయనకంటే ఇప్పుడు ఓల్డ్ లా కనిపిస్తారు. జబర్‌దస్త్ సినిమా మంచి విజయం సాధించాలని, అందరికీ మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను అంటూ రాణా చెప్పుకొచ్చారు.

సిద్ధార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మించిస్తున్న 'జబర్ దస్త్' సినిమా ఆడియో వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జబర్ దస్త్ చిత్ర యూనిట్ తో పాటు సునీల్, రాణా, శ్రీహరి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X