»   »  వాళ్ల సినిమా స్టోరీల్లో దమ్ములేదు: మహేష్ బాబు

వాళ్ల సినిమా స్టోరీల్లో దమ్ములేదు: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు చేస్తారనే విషయమై చాలా కాలంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల స్టోరీలతో మహేష్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అయితే మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ సినిమాకు కూడా ఒకే చెప్పలేదు. తెలుగులోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరో రెండేళ్ల వరకు ఆయన డేట్స్ ఖాళీ లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ విషయమై మాట్లాడారు.

Mahesh Babu

'బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ వారు చెప్పే స్టోరీలు నన్ను మెప్పించడం లేదు. మరో రెండేళ్ల వరకు హిందీ సినిమాలు చేసే ఖాళీ సమయం కూడా లేదు. ఒక వేళ పెద్ద డైరెక్టర్, ఆసక్తికర కథతో వస్తే ఆలోచిస్తాను. అయితే ఎప్పుడు చేస్తాను అనే విషయమై ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేదు.' అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా మహేష్ తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తున్నాడు.

English summary

 “I have had many offers, but nothing has excited me, moreover there is no time to do a Hindi film for the next two years at least. I don’t know, if a big director comes with an interesting subject, then I will think it over, but I am not sure,” Mahesh told to DC.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu