నానితో నాది లవ్ స్టోరీ కాదు... కామం స్టోరీ : శ్రీరెడ్డి మరో సంచలనం!
Recommended Video

నాని+శ్రీరెడ్డి=డర్జీ పిక్చర్.... త్వరలో రాబోతోంది అని శ్రీరెడ్డి చెప్పడంతో నాని గురించి ఆమె ఎలాంటి సంచలన విషయాలు బయట పెట్టబోతోందా? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శుక్రవారం ఫేస్‌బుక్‌లో లైవ్ చాటింగ్ చేసిన శ్రీరెడ్డి.... నానితో తనకు ఉన్న సంబంధం గురించి వెల్లడించింది. అతడితో తనకు గతంలో ఎఫైర్ ఉండేదని, బయట మంచోడిలా ఫోజులు కొడుతున్న నాని నిజ స్వరూపం ఇది కాదని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నానితో నాది కామం స్టోరీ
నాని+శ్రీరెడ్డి=డర్జీ పిక్చర్.... అంటే ఏమిటి? అని లైవ్ చాటింగులో ఒకరు ప్రశ్నించగా...... అది మా ఇద్దరి మధ్య జరిగిన లవ్ స్టోరీ. దాన్ని లవ్ స్టోరీ అనడం కన్నా కామం స్టోరీ అనడం బెటర్. త్వరలోనే ఆ విషయాలు బయట పెడతాను.... అని శ్రీరెడ్డి తెలిపారు.

రంకు పురాణం అందరికీ తెలిసేలా...
నాని గురించి నేను ఎప్పుడో మరిచిపోయాను. అయితే నాకు వచ్చిన ఆఫర్లను కూడా తొక్కుదామని చూస్తున్నాడు కాబట్టి అతడికి సంబంధించిన రంకు పురాణం అందరికీ తెలుపాలని డిసైడ్ అయ్యాను అని శ్రీరెడ్డి తెలిపారు.

మంచోడిలా బిల్డప్పులు వద్దు
‘నువ్వేదో మంచోడిలాగా బిల్డప్పులు దొబ్బుతున్నావు కదా. తప్పుకుండా నువ్వు చేసిన పనులు, నువ్వు ఎవరితో తిరిగావో, వాళ్లకు ఉన్న అలవాట్లు అన్నీ బయటపెడతాను' అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

నన్ను ఎవరూ ఆపలేరు
ఇలాంటి కామాంధులు ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఉన్నారు. నా ప్రాణం తీస్తారా... ఇంకేమైనా చేస్తారా.. నేను అన్నింటికీ ప్రిపేర్ అయి వచ్చాను. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నాపై బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ద్వారా ఇది ఆగుతుంది అనుకుంటే పొరపాటే.... నన్ను ఎవరూ ఆపలేరు అని అని శ్రీరెడ్డి అన్నారు.

అందరి రంకు బాగోతాలు బయటకు తీస్తా
మాతో తిరిగినపుడు మీకు నొప్పి తెలియలేదా? మమ్మల్ని యూజ్ చేసుకున్న మీ అందరి పేర్లు బయటకు రావాలి. ప్రజలకు మీ నిజస్వరూపం చూపిస్తా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగను. మీడియా నాకు సపోర్ట్ చేయక పోయినా ఫర్వాలేదు. డ్రగ్స్ కేసు కూడా తిరగతోడుతా. నన్ను అన్యాయం చేసిన వారిని తిట్టే అర్హత నాకు ఉంది. అందరి రంకు బాగోతాలు బయటకు తీస్తా.... అని శ్రీరెడ్డి అన్నారు.


Click it and Unblock the Notifications











